సముద్రం నేపథ్యంలో... | Therachappa Movie Pre - Release Event | Sakshi
Sakshi News home page

సముద్రం నేపథ్యంలో...

Apr 17 2026 12:09 AM | Updated on Apr 17 2026 12:09 AM

Therachappa Movie Pre - Release Event

శ్రీలు, నవీన్‌ రాజ్, పూజా సుహాసిని

నవీన్‌ రాజ్‌ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘తెరచాప’. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వంలో కైలాష్‌ దుర్గం నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జోయల్‌ జార్జ్‌ మాట్లాడుతూ– ‘‘సముద్రం నేపథ్యంలో సాగే మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు.

‘‘కథ నచ్చి ఈ సినిమా చేశాను’’ అన్నారు కైలాష్‌ దుర్గం. ‘‘మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని ఈ సినిమాని రూపొందించాం’’ అని నవీన్‌ రాజ్‌ చెప్పారు. ‘‘మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నవీన్‌ రాజ్‌ చాలా కష్టపడి నటించారు’’ అని రాజీవ్‌ కనకాల చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement