‘తెరచాప’: మండుటెండలో చెప్పుల్లేకుండా షూటింగ్‌, చాలా కష్టపడ్డారు | Therachaapa Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

మండుటెండలో చెప్పుల్లేకుండా షూటింగ్‌.. ‘తెరచాప’ హిట్‌ కావాలి

Apr 14 2026 4:26 PM | Updated on Apr 14 2026 4:37 PM

Therachaapa Pre Release Event Highlights

నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెరచాప’. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, జబర్దస్త్ అశోక్, నాగి కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాజీ కనకాల మాట్లాడుతూ..ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను.ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి  ప్రేక్షకుల ముందుకు  రాబోతున్నారు. అందరూ వీరిని  ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.

‘సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాం. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాం. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను’ అని హీరో నవీన్‌రాజ్ శంకరాపు  అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement