ప్రభాస్‌తో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌.. ఫ్యాన్స్‌ పండగే | Prabhas, Sandeep Vanga SPirit Movie Latest Update | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌.. ఫ్యాన్స్‌ పండగే

May 11 2026 8:20 AM | Updated on May 11 2026 9:47 AM

Prabhas, Sandeep Vanga SPirit Movie Latest Update

సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రభాస్‌లాంటి మంచి కటౌట్‌ ఉన్న హీరో విలన్స్‌ను చితక్కొడుతుంటే థియేటర్స్‌లో మాస్‌ ఆడియన్స్‌ ఫుల్‌ జోష్‌తో విజిల్స్‌ వేస్తారు. ఇలాంటి మాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసమే ప్రభాస్‌ రెడీ అవుతున్నారట. ప్రభాస్‌ తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న సినిమా ‘స్పిరిట్‌’. ఈ చిత్రంలో త్రిప్తీ దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాశ్‌రాజ్, వివేక్‌ ఒబెరాయ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

(చదవండి: రేంజ్‌ రోవర్‌ గిఫ్ట్‌.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు)

ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ వారంలోనే ప్రారంభం కానుందని సమాచారం. ప్రభాస్‌ పాల్గొనగా ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ని చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట సందీప్‌ రెడ్డి వంగా. దాదాపు వందమంది ఫైటర్స్‌ ఈ సీక్వెన్స్‌లో పాల్గొంటారని, ప్రస్తుతం ఈ ఫైట్‌కు సంబంధించిన రిహార్సల్స్‌లో ప్రభాస్‌ బిజీగా ఉన్నారని తెలిసింది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో భూషణ్‌కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, క్రిషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్‌  కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement