రాయవలస రాధిక అనిపించుకుంటాను | Rayavalasa Movie Director Radhika Speech | Sakshi
Sakshi News home page

రాయవలస రాధిక అనిపించుకుంటాను

May 9 2026 4:17 PM | Updated on May 9 2026 4:17 PM

Rayavalasa Movie Director Radhika Speech

కార్తీక్‌ని హీరోగా పరిచయం చేస్తూ అతని తండ్రి నిర్మాతగా, తల్లి డైరెక్టర్‌గా 'రాయవలస' సినిమా చేయడం ఆనందంగా అనిపించింది. టీజర్‌ చాలా బాగుంది. కార్తీక్‌కి యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్... ఇలా అన్ని విషయాల్లో మంచి అవగాహన ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని హీరో ఆకాశ్‌ జగన్నాథ్‌ అన్నారు. కార్తీక్‌ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ రాధిక జయంతి దర్శకత్వంలో గోపీకృష్ణ .జె నిర్మించిన చిత్రం 'రాయవలస'. ఈ చిత్ర టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆకాశ్‌ జగన్నాథ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మరో అతిథిగా విచ్చేసిన కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. తల్లి డైరెక్షన్, తండ్రి ప్రొడక్షన్, కొడుకు హీరోగా చేయడం విశేషం. 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్‌ ఫిలిమ్స్, మ్యూజిక్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు. ఇలాంటి క్వాలిటీని ఈ  పదిహేనేళ్లల్లో ఏ ఎన్నారైలోనూ చూడలేదు. వాళ్లు పడిన కష్టానికి ఫలితం దక్కుతుందని నమ్ముతున్నానని అన్నారు.

నా కలను తమ కలగా మార్చుకుని, నాతో సినిమా చేసిన మా అమ్మానాన్నకు థ్యాంక్స్‌. నిజంగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాకి అందరూ కనెక్ట్‌ అవుతారని నమ్ముతున్నానని కార్తీక్‌ చెప్పారు. ఈ సినిమాకి మంచి కథ ఇచ్చిన రాఖీకి థ్యాంక్స్‌. కార్తీక్‌కి చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. కథ నచ్చి, నా భర్త ఈ సినిమాని నిర్మించారు. ఈ  సినిమాతో 'రాయవలస' రాధికగా గుర్తింపు తెచ్చుకుంటాననే నమ్మకం ఉందని రాధిక జయంతి అన్నారు. పదేళ్ల క్రితమే షార్ట్‌ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లు, ఇండిపెండెంట్‌ సాంగ్స్‌ చేశాం. ఇప్పుడు సినిమాతో వస్తున్నామని గోపీకృష్ణ .జె అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement