ఊహించనివి జరగడమే ఆశ్చర్యం. అలాంటి ప్రచారమే ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అదీ నటి త్రిష గురించి. ఈ సంచలన నటి పేరు ప్రజల్లో ఒక జపంలా మరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రిష నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారు. రాజకీయ రంగప్రవేశానికి దారులు తెరుసుకుంటున్నాయి వంటి ఆసక్తికరమైన ప్రచారం జోరుందుకున్న విషయం తెలిసిందే. అయితే తాను సినిమాలకు ఎప్పటికీ దూరం కానని, హీరోయిన్ అవకాశాలు రాకపోయినా, ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో జీవితాంతం నటిస్తూనే ఉంటాను అని ఆమె ఇటీవల తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు.
అదే విధంగా ఇటీవల ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కాగా తాజాగా మరో క్రేజీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే నటుడు కమలహాసన్, రజనీకాంత్ కలిసి సుదీర్ఘ కాలం తరువాత కలిసి నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థపై ఇన్బన్ ఉదయనిధి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.
మరో రెండు నెలలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో నటి త్రిషను హీరోయిన్‌గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రంలో నటించడానికి ఆమెకు రూ. 12 కోట్లు పారితోషికం అందించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజయం అయితే త్రిష క్రేజ్ మరోసారి మారుమోగడం ఖాయం.
కాగా ఇంతకు ముందు నటుడు కమలహాసన్‌కు జంటగా మన్మధన్ అన్బు, తూంగావనం, థక్‌లైఫ్ చిత్రాల్లో త్రిష నటించారు. అదే విధంగా నటుడు రజనీకాంత్‌తో కలిసి పేట చిత్రంలో నటించారు. ఇప్పుడు వీరిద్దరితో కలిసి నటిస్తే ఆ క్రేజే వేరుగా ఉంటుంది.


