విషాదం.. టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత | Telugu Producer Kakarla Krishna No More | Sakshi
Sakshi News home page

Kakarla Krishna: తెలుగు నిర్మాత కృష్ణ మృతి

May 9 2026 3:27 PM | Updated on May 9 2026 3:41 PM

Telugu Producer Kakarla Krishna No More

టాలీవుడ్‌లో విషాదం. సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని చెప్పిన నిర్మాతల మండలి సంతాపం తెలియజేసింది. ఈ క్రమంలోనే పలువురు నిర్మాత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: నేను చనిపోలేదు బతికే ఉన్నాను: 'యానిమల్' నటుడు)

ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ 'జగపతి' సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా తొలుత పనిచేసిన కాకర్ల కృష్ణ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. ఆ అనుభవంతోనే 1974లో కృష్ణ, అంజలీదేవీ నటించిన 'ఇంటింటి కథ' చిత్రంతో నిర్మాతగా మారారు. తర్వాత ఏడంతస్తుల మేడ, ఊరంతా సంక్రాంతి, రాగదీపం తదితర మూవీస్ తీశారు.

ఈయన నిర్మించిన 'ఇంటింటి కథ' విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2023లో స్వర్ణోత్వస వేడుకులు కూడా చేశారు. తర్వాత పలు ఇంటర్వ్యూల్లోనూ తన అనుభవాల్ని పంచుకున్నారు. ఇప్పడు వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు.

(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ట్వీట్‌కి పూనమ్ కౌర్ కౌంటర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement