నేను ఆరోగ్యంగానే ఉన్నాను | Senior Bollywood actor Shakti Kapoor Dismisses Fake Death Rumours | Sakshi
Sakshi News home page

నేను ఆరోగ్యంగానే ఉన్నాను

May 9 2026 6:10 AM | Updated on May 9 2026 6:10 AM

Senior Bollywood actor Shakti Kapoor Dismisses Fake Death Rumours

– శక్తి కపూర్‌

‘‘నేను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను. నా గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం... వాటిని నమ్మకండి’’ అని సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ తెలిపారు. శక్తి కపూర్‌ మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. ఈ వార్తలపై ఆయన స్పందించి, ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మృతి గురించి వస్తున్న వార్తలు అబద్ధం.

 ఇలాంటి పుకార్లను నమ్మకండి. ఇలాంటి తప్పుడు వార్తలను అందరం ఖండించాలి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’’ అని పేర్కొన్నారాయన. విలన్‌గా, కమెడియన్‌గా దాదాపు 700 చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు శక్తి కపూర్‌. ఆయన కుమార్తె శ్రద్ధా కపూర్‌ బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’ ద్వారా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement