breaking news
death News
-
ఎస్ఐఆర్పై చర్చకు పట్టు స్తంభించిన లోక్‌సభ
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశం మరోసారి పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. పార్లమెంట్ ఉభయ సభల సభాకార్యకలాపాలకు బదులు ఎస్ఐఆర్ అంశంపైనే చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్‌సభ అర్ధంతరంగా మంగళవారానికి వాయిదాపడింది. వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభలో విపక్షసభ్యుల నిరసనల కారణంగా కనీసం ఒక్క బిల్లు కూడా సభామోదానికి నోచుకోలేదని అధ్యక్షస్థానంలో ఉన్న స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలు మాని విపక్షసభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తిచేసినా ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం లోక్‌సభ మొదలుకాగానే విపక్ష సభ్యులు తమ సీట్లలోంచి లేచి వెల్‌లోకి దూసుకొచ్చారు. ఎస్ఐఆర్పై చర్చించాలని నినాదాలుచేశారు. ప్రభుత్వ వ్యతిరేక, ఎస్ఐఆర్ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటల వరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ ఇదే అంశంపై చర్చకు మొండిపట్టుబట్టారు. దీంతో సభాధ్యక్షస్థానంలో కూర్చున్న జగదాంబికాపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈరోజు రెండు కీలక క్రీడా బిల్లులను సభలో చర్చించి, ఆమోదించాల్సి ఉంది. ఇలా నినాదాలు, ఆందోళన చేయడంతో భారతీయ క్రీడాకారులకు అన్యాయం చేసినవాళ్లమవుతాం’’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం ఇదే తరహాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నినాదాల హోరు మధ్యే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కస్టమ్స్ సుంకాలకు సంబంధించిన తీర్మానాన్ని చేశారు. ఈ తీర్మానం సభ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ‘‘వర్షాకాల సమావేశాలు జూలై 21వ తేదీన మొదలైనప్పటి నుంచీ మీరు సభ జరక్కుండా ఆటంకం కల్గిస్తున్నారు. ఇలా వరసగా గత మూడు వారాలుగా అవరోధాలు సృష్టిస్తున్నారు’’అని జగదాంబికాపాల్ వ్యాఖ్యానించి సభను మంగళవారానికి వాయిదావేశారు. ‘‘తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నారన్న ఆశతో మిమ్మల్ని లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకుని లోక్‌సభకు పంపించారు. మీరేమో ఇలా నినాదాలు చేస్తూ ముఖ్యమైన బిల్లులు చర్చకు రాకుండా, సభామోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. సభా గౌరవాన్ని మీరంతా కించపరుస్తున్నారు’’అని ఓం బిర్లా సైతం వ్యాఖ్యానించడం తెల్సిందే.సోరెన్ మరణంతో రాజ్యసభ వాయిదా రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణానికి సంతాప సూచికగా రాజ్యసభలో ఎలాంటి అంశాలను చర్చకు స్వీకరించలేదు. బిల్లులనూ ప్రవేశపెట్టలేదు. రాజ్యసభ సోమవారం ఉదయం ప్రారంభంకాగానే సోరెన్ మరణ వార్త, సంతాప సందేశాన్ని సభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభ్యులందరికీ చదివి వినిపించారు. ‘‘గిరిజనుల హక్కుల కోసం అవిశ్రాంతంగా సోరెన్ పోరాడారు’’అని సోరెన్‌ను హరివంశ్ గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి గౌరవ సూచికగా సభలో ఎలాంటి చర్చను డెప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. సభను మంగళవారానికి వాయిదావేశారు. 2020 జూన్‌లో సోరెన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. -
ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం
ప్రముఖ లేడీ యాంకర్ అపర్ణ వస్తారే కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడిన ఈమె.. గురువారం రాత్రి మరణించారు. ఈ విషయాన్ని అపర్ణ భర్త చెప్పుకొచ్చారు. కన్నడలో గత 40 ఏళ్లుగా నటిగా, యాంకర్, న్యూస్ యాంకర్‌గా చేసిన ఈమె ఇప్పుడు ఇలా మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తన సంతాపాన్ని తెలియజేశారు.(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు)1984లోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. డీడీ చందన ఛానెల్లో న్యూస్ రీడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటితో పాటే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. 1998లో దీపావళి ప్రోగ్రాంకి దాదాపు ఎనిమిది గంటల పాటు యాంకరింగ్ చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో వినిపించే అనౌన్స్మెంట్కి వాయిస్ ఇచ్చింది ఈమెనే కావడం విశేషం.ఇక బిగ్ బాస్ కన్నడ షోలోనూ పాల్గొన్న ఈమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే కన్నడలో అద్భుతమైన డిక్షన్‌తో యాంకర్‌గా ఈమెని కొట్టేవాళ్లు లేరని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఈమె మృతి పట్ట సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ సాయం.. ట్రాన్స్ జెండర్ కంటతడి)ನಟಿ, ಖ್ಯಾತ ನಿರೂಪಕಿ ಅಪರ್ಣಾ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ತಿಳಿದು ನೋವಾಯಿತು. ಸರ್ಕಾರಿ ಸಮಾರಂಭಗಳು ಸೇರಿದಂತೆ ಕನ್ನಡದ ಪ್ರಮುಖ ವಾಹಿನಿಗಳ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಅತ್ಯಂತ ಸೊಗಸಾಗಿ ನಿರೂಪಣೆ ಮಾಡುತ್ತಾ ನಾಡಿನ ಮನೆಮಾತಾಗಿದ್ದ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆಯೊಂದು ಬಹುಬೇಗ ನಮ್ಮನ್ನು ಅಗಲಿರುವುದು ದುಃಖದ ಸಂಗತಿ.ಮೃತ ಅಪರ್ಣಾಳ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ… pic.twitter.com/fZs9L6m42Q— Siddaramaiah (@siddaramaiah) July 11, 2024 -
అమర్త్యసేన్ ఆరోగ్యంగానే ఉన్నారు
ప్రముఖ ఆర్తికవేత్త, నోబెల్ గ్రహీత.. భారతరత్న అమర్త్య సేన్(89) కన్నమూశారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. మంగళవారం మధ్యాహ్నాం ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది కాస్త ఆంగ్ల మీడియాలో టెలికాస్టింగ్ దాకా వెళ్లింది. అయితే.. అదంతా ఫేక్ సమాచారం అని ఆయన కూతురు నందనా సేన్ స్పష్టత ఇచ్చారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎప్పటిలాగే తన పనుల్లో బిజీగా ఉన్నారంటూ కూతురు నందనా దేబ్ సేన్ స్పష్టత ఇచ్చారు. తాజాగా ఆయన కుటుంబంతో కేంబ్రిడ్జిలో వారంపాటు గడిపారని, హర్వార్డ్లో తరగతులు చెప్పడంలో మునిగిపోయారని ఆమె వెల్లడించారు. Friends, thanks for your concern but it’s fake news: Baba is totally fine. We just spent a wonderful week together w/ family in Cambridge—his hug as strong as always last night when we said bye! He is teaching 2 courses a week at Harvard, working on his gender book—busy as ever! pic.twitter.com/Fd84KVj1AT — Nandana Sen (@nandanadevsen) October 10, 2023 అమెరికన్ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్(2023 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత కూడా).. తాజాగా తన ఎక్స్ అకౌంట్లో అమర్త్యసేన్ కన్నుమూశారని ట్వీట్ చేశారంటూ ఒక ప్రచారం నడిచింది. అయితే.. అది ఫేక్ అకౌంట్ అని తర్వాతే తేలింది. హర్వార్డ్ యూనివర్సిటీలో చదివిని అమర్త్య సేన్ కూతురు నందనా దేవ్ సేన్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించడమే కాదు.. బాలల హక్కుల ఉద్యమకారిణి కూడా. -
నేను ఆరోగ్యంగా ఉన్నాను.. ఆ వార్తలు నమ్మకండి: నటుడు సుధాకర్
సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధాకర్ అనారోగ్యంతో బాధడపడుతున్నారని, ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయినట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ తప్పుడు వార్తలపై సుధాకర్ స్వయంగా స్పందించారు. కొంతకాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను దయచేసి నమ్మవద్దని కోరారు. ఈ మేరకు స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా నటుడు సుధాకర్ చనిపోయినట్లు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సర్యులేట్ అయ్యాయి. ఈమధ్యే నటుడు కోట శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బతికున్న మనుషుల్ని కూడా చంపేస్తున్నారంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హీరో అజిత్ రీల్ కూతురు చనిపోయినట్లు పోస్టర్ కలకలం
బుట్టబొమ్మ హీరోయిన్ అనికా సురేంద్రన్ చనిపోయినట్లు ఓ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆమెకు ఏమైంది? అనికా చనిపోయిందా అంటూ ఫ్యాన్స్ షాకవుతున్నారు. కోలీవుడ్ స్టార్హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమయ్యింది అనికా సురేందర్. 2019లో విడుదలైన ఈ సినిమాలో అనికా అజిత్‌కు కూతురి పాత్రలో నటించింది. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న అనికాను అప్పట్నుంచి అజిత్ రీల్ కూతురిగా పిలిచేవారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత పలు తమిళం, మలయాళ సినిమాలు చేసిన అనికా బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా మారింది. కొత్త డైరెక్టర్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాతో అనికా తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ చిత్రం మిశ్రమ ఫలితాన్ని సాధించినా అనికా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత మలయాళంలో మరో సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనికా తరచూ తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె చనిపోయినట్లు ఓ పోస్టర్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజం లేదని, ఓ సినిమా కోసం చేసిన రీల్ పోస్టర్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: నయనతార అందగత్తె, స్వీట్ పర్సన్ : షారుక్ ఖాన్ -
శరత్‌బాబుకు సంతాపం తెలిపిన కమల్‌హాసన్.. కాసేపటికే ట్వీట్ డిలీట్
సీనియర్ నటుడు శరత్‌బాబు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన మరణించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శరత్‌బాబు కన్నుమూశారంటూ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శరత్‌బాబు సోదరి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ శరత్‌బాబు బతికే ఉన్నారని, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దంటూ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. అయితే అప్పటికే శరత్‌బాబు చనిపోయాడంటూ వార్తలు బాగా వైరల్ కావడంతో పలువురు ఆయనకు సంతాపం కూడా వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఇలాగే తప్పులో కాలేశారు. శరత్‌బాబుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. 'నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్‌బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం'.. అంటూ ట్వీట్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే కమల్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: హీరోయిన్ మెహ్రీన్‌కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? -
Shinzo Abe Death: ఆత్మీయుడికి నివాళిగా భారత్ సంతాప దినం
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా.. శనివారం ఒక్కరోజు సంతాపం దినం పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నా ప్రియమైన మిత్రుడు షింజో అబే ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది అని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. భారతదేశం-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఎల్లప్పుడూ మక్కువ చూపే ఆయన( షింజోను ఉద్దేశించి..) జపాన్-ఇండియా అసోసియేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టోక్యోలో నా ప్రియమిత్రుడితో దిగిన రీసెంట్ ఫొటో అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో అనుబంధం కొనసాగిందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు ఆయన ఎంతో కృషి చేశారని, తాజా పర్యటనలోనూ ఆయనతో ఎన్నో కీలకాంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ.. షింజో అబే సేవలను గుర్తు చేసుకున్నారు. Sharing a picture from my most recent meeting with my dear friend, Shinzo Abe in Tokyo. Always passionate about strengthening India-Japan ties, he had just taken over as the Chairman of the Japan-India Association. pic.twitter.com/Mw2nR1bIGz — Narendra Modi (@narendramodi) July 8, 2022 చైనా అంటే డోంట్ కేర్ చైనా దుష్టపన్నాగాలను ముందే ఊహించిన వ్యక్తి, చైనా అంటే బెణుకు లేని నేతగా షింజో అబేకి ఓ పేరుంది. అలాగే భారత్‌తో మైత్రి బలపడడానికి అబే కృషి ఎంతో దాగుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు ఉన్న టైంలో.. ఆయన నాలుగసార్లు భారత్‌కు వచ్చారు. ఇది చాలూ.. ఆయనకు భారత్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. ఆ సమయంలో భారత్ ఆతిథ్యాన్ని ఆస్వాదించడంతో పాటు మోదీ సర్కార్‌తో ఆయన కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు.. ప్రపంచబ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులు చైనాకు భయపడి.. అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు వెనుకంజ వేశాయి. ఆ సమయంలో.. సుమారు 13 వేల కోట్ల రూపాయాలను ఈశాన్య రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు షింజో అబే. 2014లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. ఆ గౌరవంద దక్కించుకున్న జపాన్ ప్రధానిగా నిలిచారాయన. అలాంటి ఆత్మీయుడి కోసం జాతీయ జెండాను సగం వరకు అవనతం చేసి.. శనివారం నివాళి అర్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. -
విషాదం: డ్రగ్స్ మధ్యలో నటుడి మృతదేహం
Michael K. Williams Death News: డ్రగ్స్ మత్తు మరో మంచి నటుడిని బలి తీసుకుంది!. హాలీవుడ్ సీనియర్ నటుడు మికాయిల్ కెన్నెత్ విలియమ్స్(54) డ్రగ్స్‌కు బానిసై కన్నుమూశాడు. హెచ్‌బీవో బ్లాక్‌బస్టర్ డ్రామా ‘ది వైర్’లో ఒమర్ లిటిల్ క్యారెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు మికాయిల్ కె విలియమ్స్. బ్రూక్లిన్‌లోని అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయన మృతిని.. సోమవారం మధ్యాహ్నం పోలీసులు ప్రకటించారు. దశాబ్దాలుగా టీవీ ఆడియొన్స్‌ను అలరించిన మికాయిల్ కె విలియమ్స్.. ఐదుసార్లు ప్రైమ్‌టైం ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2021లోనూ ‘లవ్‌క్రాఫ్ట్ కంట్రీ’కి ఎమ్మీ నామినేషన్ దక్కించుకున్నారాయన. రెండురోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దగ్గరి బంధువు ఒకరు సోమవారం మైకేల్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూశారు. అక్కడ డ్రగ్స్ ప్యాకెట్స్ మధ్య విలియమ్స్ మృతదేహాంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు ఆ బంధువు. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే మికాయిల్ చనిపోయినట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్దారణ అయ్యింది. డ్రగ్స్ నుంచి బయటపడలేక.. ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తో ఆడియొన్స్‌కు బాగా గుర్తుండిపోయిన మికాయిల్ కె విలియమ్స్.. భార్య చనిపోయాక కొడుకుతో ఉంటున్నారు. అయితే కొన్ని నెలలుగా ఆయన డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ అలవాటు గురించి ప్రస్తావించి.. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారాయన. బుల్లెట్లో మికాయిల్(కుడి చివర) 1966 నవంబర్‌లో బ్రూక్లిన్‌లో పుట్టిన మికాయిల్ విలియమ్స్.. 22 ఏళ్లకు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాడు. సుమారు 50కిపైగా మ్యూజిక్ వీడియోలు చేశారు. 1996లో ‘బుల్లెట్’ మూవీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి.. ఓవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపైనా రాణించారు. మార్టిన్ స్కొర్సెజే డైరెక్షన్‌లోనూ.. ‘చాకీ, బ్రాడ్‌వాక్ ఎంపైర్, బెస్సీ, 12 ఇయర్స్ ఏ స్లేవ్’ లాంటి సినిమాల్లో నటనతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారాయన. అయితే మికాయిల్కు గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు దక్కింది మాత్రం ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తోనే. చదవండి: అబ్బాయి నుంచి అమ్మాయిగా.. -
మసూద్ సజీవం : పాక్ మీడియా
ఇస్లామాబాద్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించలేదని, ఆయన సజీవంగా ఉన్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్ పేర్కొంది. జైషే చీఫ్ మసూద్ అజర్ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్ తెలిపింది. పాక్ ప్రభుత్వం నుంచి మసూద్ పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదని, ఈ క్షణంలో ఏం జరిగిందనేది తనకు తెలియదని పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌధరి పేర్కొనడం గమనార్హం. కాగా, మసూద్ తీవ్ర అనారోగ్యంతో ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే అంశం మినహా తమకు ఎలాంటి సమాచారం లేదని భారత అధికారులు స్పష్టం చేశారు. (ఉగ్ర మసూద్ మృతి?) మరోవైపు మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన నిర్ధారించినట్లయ్యింది. తమ భూభాగంలోనే మసూద్ ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించడం అదే తొలిసారి కావడం గమనార్హం. -
సంక్రాంతికి వస్తాడని...
⇒ కుమారుడి రాక కోసం ఎదురుచూస్తుండగా మృతి వార్త ⇒ కుప్పకూలిన తల్లిదండ్రులు ⇒ మృతుడు గౌహతి ఐఐటీ విద్యార్థి.. ⇒ ఉరివేసుకొని హాస్టల్లో ఆత్మహత్య ⇒ చిన్నతనం నుంచి చదువులో రాణింపు కె.కోటపాడు: ‘అమ్మా.. నాన్నా.. సంక్రాంతి పండగకు వస్తా..’ అని సంతోషంగా చెప్పిన కొన్ని గంటలకే కొడుకు చావు వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు. త్వరలో చదువు పూర్తవుతుందని, విదేశాల్లో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం ఫోన్ రావడంతో కుప్పకూలిపోయారు. కె.కోటపాడు గ్రామానికి చెందిన కాకి పరమేశ్వరరావు (22) అస్సాం రాష్ట్రం, గౌహతి ఐఐటీలో బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడ ఏ కష్టమొచ్చిందో ఏమో గురువారం కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరమేశ్వరరావు ఉదయం నుండి హాస్టల్ గదిలో నుండి బయటకు రాకపోవడంతో అనుమానించిన స్నేహితులు తలుపుకొట్టినా తెరవలేదు. దీంతో వారు వెంటిలేటర్ నుండి చూడగా ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అక్కడ నుండి ఫోన్లో హిందీలో తెలపడంతో తల్లి పార్వతికి అర్ధం కాలేదు. కాసేపటికి ఇంటికి వచ్చిన భర్త వెంకటరావుకు హిందీలో ఎవరో ఫోన్ చేశారని చెప్పింది. ఆయన కళాశాలకు తిరిగి ఫోన్ చేయగా కుమారుడు మృతి చెందాడని తెలియడంతో కుప్పకూలారు. చదువుల్లో ఎప్పుడూ ప్రథమమే పరమేశ్వరరావు చిన్నప్పటినుండి చదువులో ఎప్పుడూ ఫస్టే. కె.కోటపాడు వేణు విద్యానికేతన్‌లో 5 వరకు చదివి కొమ్మాది నవోదయలో సీటు సాధించి అక్కడ చేరాడు. అక్కడ 10వ తరగతి పరిక్షల్లో 94.6శాతం మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలిచాడు. తరువాత విశాఖపట్నం శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివి 950 మార్కులతో ఉత్తీర్ణత సాధించి గౌహతి ఐఐటీలో సీటు పొందాడు. అక్కడ బి.టెక్ (మెకానికల్) పైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్క పెళ్లికి వచ్చాడు పరమేశ్వరరావు ఈ ఏడాది మార్చిలో జరిగిన అక్క లక్ష్మి వివాహానికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లిపోయాడు. సంక్రాంతి పండగకు జనవరి 9న వస్తానంటూ తల్లి దండ్రులకు బుధవారమే ఫోన్ చేసి చెప్పాడు. అంతలోనే తమ ఒక్కగానొక కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లి దండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. పెద్దమ్మాయికి వివాహం కాగా, చిన్నమ్మాయి యమున రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది.