నాజర్, అంజలి ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ముసలోడికి దసరా పండుగ. ఈ సినిమాకు మనోహర్ దర్శకత్వం వహించారు. రమణా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత రమణ వాళ్లె నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా నిర్మాత రమణ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకముంది. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాలో అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డి. ఇమాన్ సంగీతమందించారు.


