breaking news
Anjali (14)
-
స్టార్ హీరో సినిమా.. టీజర్‌తో టైటిల్ ప్రకటన
విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. తాజాగా ఒక టీజర్‌తో 'మకుటం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. విశాల్ కెరీర్లో 35వ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కీ రోల్లో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఆపై దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌కు ఇది 99వ చిత్రం కావడం విశేషం. ‘మద గద రాజా’ చిత్రంలో అంజలి, వరలక్ష్మిలతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని అని యూనిట్ తెలిపింది. -
ఆ నటితో సచిన్ టెండుల్కర్ ప్రేమ?!.. అంజలి కంటే ముందు..
క్రికెట్- బాలీవుడ్ మధ్య విడదీయలేని అనుబంధం ఉందని చెప్పవచ్చు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగోర్ నుంచి విరాట్ కోహ్లి (Virat Kohli- Anushka Sharma)- అనుష్క శర్మ, కేఎల్ రాహుల్- అతియా శెట్టి వరకు చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అందుకే ఈ రెండు రంగాలకు చెందిన ఆడ- మగ కలిసి కనిపించారంటే ‘రిలేషన్షిప్’ గురించి వదంతులు పుట్టుకురావడం సహజమే. అయితే, క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండుల్కర్ (Sachin Tendukar) గురించి 90వ దశకంలో ఇలాంటి ఓ రూమర్ వచ్చింది. నటి శిల్పా శిరోద్కర్‌తో కలిపి సచిన్ పేరు వినిపించింది. వీరిద్దరు ప్రేమలో పడ్డారని ఆ వదంతుల సారాంశం.శిల్పా శిరోద్కర్‌తో అఫైర్?అయితే, ఇందుకు సచిన్ టెండుల్కర్- శిల్పా శిరోద్కర్ స్పందించిన తీరు మాత్రం భిన్నంగా ఉండటం గమనార్హం. గతంలో సచిన్ టెండుల్కర్ ఇండియా టుడేతో మాట్లాడుతుండగా ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకూ- శిల్పా శిరోద్కర్‌తో అఫైర్?అన్నింటికంటే అత్యంత చెత్త రూమర్ ఇది.ఎందుకంటే మేమిద్దరం అసలు ఒకరికి ఒకరం పరిచయమే లేదు’’ అని కొట్టిపారేశాడు. మరోవైపు.. శిల్పా శిరోద్కర్ మాత్రం.. ‘‘నేను హమ్ సినిమా చేస్తున్న సమయంలో.. అంటే 1991లో తొలిసారి సచిన్‌ను కలిశాను. మా కజిన్ బాంద్రా ఈస్ట్‌కు ఆడేవాడు.ఒక్కసారి సచిన్‌ను కలిశానుఅదే జట్టు తరఫున సచిన్ కూడా ఆడేవాడు. అలా తన ద్వారా సచిన్ కలిసే అవకాశం వచ్చింది. అప్పటికే సచిన్ అంజలితో ప్రేమలో ఉన్నాడు. అయితే, అప్పటికి ఇంకా ఈ విషయం గురించి బయటకు రాలేదు.మేమే స్నేహితులం కాబట్టి మాకు ముందే ఈ విషయం తెలుసు. ఏదేమైనా ఓ నటి- క్రికెటర్‌ను కలిసింది అంటే.. అది కూడా సచిన్ టెండుల్కర్‌ను కలిసింది అంటే ఇలాంటి వార్తలు పుట్టుకురావడం సహజమే కదా!.. ఏదేమైనా ఒక్కసారి సచిన్‌ను నేను నేరుగా కలిశానని మాత్రం ఒప్పుకొంటా’’ అని పేర్కొంది.అంజలితో పెళ్లికాగా తన కంటే ఐదేళ్లు పెద్దదైన డాక్టర్ అంజలిని ప్రేమించిన సచిన్ టెండుల్కర్ 1995లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె సారా, కుమారుడు అర్జున్ సంతానం. ముప్పై ఏళ్ల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న అంజలి- సచిన్ దంపతులు ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ఉంటారు. మరోవైపు.. శిల్పా శిరోద్కర్ 2000 సంవత్సరంలో యూకేకు చెందిన బ్యాంకర్ అపరేశ్ రంజిత్‌ను పెళ్లి చేసుకుంది. కాగా శిల్పా మరెవరో కాదు... సూపర్‌స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌కు సొంత చెల్లెలు. అంటే.. మహేశ్ బాబుకు మరదలు అన్నమాట.సిరాజ్‌కు రాఖీ కట్టిన జనాయ్ఇదిలా ఉంటే.. ఇటీవల మహ్మద్ సిరాజ్- జనాయ్ భోస్లే గురించి కూడా ఇలా రిలేషన్షిప్ వార్తలు వచ్చాయి. అయితే, రాఖీ పూర్ణిమ రోజు జనాయ్ సిరాజ్‌కు రాఖీ కట్టి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ గాసిప్‌రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా జనాయ్.. దిగ్గజ గాయని ఆశా భోస్లే మనుమరాలు.చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది'
బుల్లితెర నటి అంజలి పవన్ (Anjali Pavan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో నటి శోకసంద్రంలో మునిగిపోయింది. అమ్మ చనిపోయిన విషయాన్ని అంజలి.. సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అమ్మా, నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నువ్వు ఇచ్చిన ప్రేమ, నీ చిరునవ్వు, నీ మాటలు.. ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసినా.. మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు.నమ్మలేకపోతున్నాం..నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలకు దారి చూపిస్తుంది. అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఇతర నటీనటులు.. అయ్యో, నమ్మలేకపోతున్నాం.. ఓం శాంతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ మీ అమ్మగారు మీ కడుపున పుడతారు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ అభిమానులు నటిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.రెండో ప్రెగ్నెన్సీ..మొగలిరేకులు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అంజలి ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. 2017లో నటుడు సంతోష్ పవన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి చందమామ అనే కూతురు ఉంది. ఇటీవలే రెండోసారి గర్భం దాల్చగా.. జూన్‌లో అంజలికి ఘనంగా సీమంతం కూడా చేశారు. త్వరలోనే మరో బుజ్జాయి ఇంట్లో అడుగుపెట్టనుందని సంతోషిస్తుండగా.. అంతలోనే అమ్మ మరణించడంతో నటి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అంజలి.. రాధా కల్యాణం, దేవత వంటి సీరియల్స్‌తో పాటు లెజెండ్, ఒక లైలా చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Anjali Attota (@anjaliattota) చదవండి: జాతీయ అవార్డ్స్.. వాళ్ల కష్టానికి ఫలితం అంటూ షారుక్ ఖాన్ -
పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
యశవంతపుర (కర్ణాటక): రాష్ట్రంలో బాలింతల మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. బెళగావి తాలూకా కరడిగుద్ది గ్రామానికి చెందిన గంగవ్వ గోడకుంద్రి (31) అనే బాలింత మరణించింది. జనవరి 28న గంగవ్వ ప్రసవం కోసం బెళగావి బిమ్స్ ఆస్పత్రిలో చేరారు. జనవరి 30న రాత్రి కొడుకు పుట్టాడు. జనవరి 31న బీపీ పడిపోయి ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు కుటుంబసభ్యుకు తెలిపారు. చికిత్స పొందుతూ గంగవ్వ కన్నుమూశారు. వైద్యులు నిర్లక్ష్యంగా ప్రసవం చేయడం వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రసవానికి ముందు ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని వైద్యులు తమ వద్ద తెల్ల పేపర్‌పై సంతకం చేయించుకొన్నారని, చివరకు మృతదేహాన్ని అప్పగించారని విలపించారు. ఆరోగ్యం క్షీణించిన సమయంలో సరైన చికిత్సలు చేసి ఉంటే మా అక్క బతికేదని మృతురాలి సోదరుడు శంకరప్ప ఆరోపించారు. బెళగావి ఎపిఎంసి పోలీసుస్టేషన్లో వైద్యులపై ఫిర్యాదు చేశారు. పుట్టిన గంటలకే తల్లికి దూరమైన శిశువును చూసి అందరూ అయ్యో అన్నారు.అదే మాదిరిగా అంజలి పాటిల్..బెళగావి తాలూకా నిలాజి కి చెందిన అంజలి పాటిల్ (30) అనే బాలింత 4 రోజుల కిందట బిమ్స్లోనే ఇదే మాదిరి చనిపోయింది. ఆమెకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవ వేదన ఆరంభం కాగా, వైద్యులు వేచి చూద్దామని చెప్పారు. చివరకు కుటుంబీకుల ఒత్తిడితో సిజేరియన్ కాన్పు చేశారు. కొంతసేపటికి తీవ్ర రక్తస్రావమై ఆమెకు మూర్ఛ వచ్చి మరణించింది. వైద్యుల అలసత్వమే కారణమని బంధువులు ధర్నా చేశారు.హైరిస్క్ కేసులే: వైద్యులుఆస్పత్రి వైద్యాధికారులు స్పందిస్తూ, ఈ వైద్యశాలలో ఏడాదికి 10 వేలకు పైగా కాన్పులు చేస్తామని, అందులో సగం హైరిస్క్ కేసులని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే తాము శ్రమిస్తామని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు, తాలూకా ఆస్పత్రుల నుంచి సీరియస్ అంటూ చివరి నిమిషంలో తమ వద్దకు పంపిస్తారని తెలిపారు. -
'నిడదవోలుకు రైలుబండి' అంటూ హీరోయిన్లతో విశాల్ స్టెప్పులు
విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచిన 'చికుబుకు రైలుబండి' సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సుమారు 12 ఏళ్ల పాటు పక్కనపడేసిన సినిమా కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లతో సుమారు రూ. 100 కోట్ల వరకు రాబట్టింది.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి(Anjali), వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. ప్రస్తుతం విడుదలైన సాంగ్‌లో ఇద్దరు హీరోయిన్లతో విశాల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. -
‘అంజలి’కి కొండంత అండ..!
‘సాక్షి’ కథనానికి స్పందించిన పలువురు ప్రముఖులు ♦ ఆమె బాగోగులు చూసుకునే బాధ్యత అధికారులకు అప్పగించిన జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ♦ పత్తి మిల్లులో రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కార్మికశాఖ అధికారులకు ఆదేశాలు ♦ అంజలి చదువు బాధ్యతలను తీసుకుంటానన్న సీపీఐ జాతీయ నేత డాక్టర్. కె.నారాయణ ♦ అవే బాధ్యతలు మోసేందుకు ముందుకొచ్చిన టీఆర్ఆర్ గ్రూప్ మాజీ డెరైక్టర్ ♦ అంజలికి తామూ బాసటగా ఉంటామని విన్ఫ్రిన్ ఫౌండేషన్ ప్రకటన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బాల్య వివాహ దురాచారాన్ని ధిక్కరించి... చదువుకోవాలన్న తన ఆసక్తిని లోకానికి చాటిచెప్పి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిన నల్లగొండ జిల్లా డిండి మండలం శేషాయకుంటకి చెందిన వరికుప్పల అంజలి(14)కి అండగా ఉంటామని పలువురు ముందుకొచ్చారు. ‘ప్రియమైన అంజలీ... నీకు జేజేలు’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన ఎడిషన్‌లో శనివారం ప్రచురితమైన కథనానికి స్పందిం చిన పలువురు ఆమెను ఆదుకుంటామని ప్రకటించారు. ఆమెకు కావాల్సిన సాయా న్ని చేస్తామని తమ ఉదారతను చాటుకున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం అంజలి పట్ల బాధ్యతగా స్పందించింది. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ ‘సాక్షి’ కథనంపై ఆరా తీశారు. అంజలి స్థితిగతుల గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంజలి బాగోగులను చూసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆమె గురించిన వివరాలను తమకు తెలియజేయాలని జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోతీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రాజశేఖర్‌లను ఆయన ఆదేశించారు. అదే విధంగా ఆమనగల్లో అంజలి పనిచేసిన కాటన్‌మిల్లు యాజమాన్యం ఆమెకు ఇవ్వాల్సిన రూ. లక్షన్నర రూపాయలను ఇప్పించాలని కూడా ఆయన కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న కార్మిక శాఖ అధికారులతో మాట్లాడిన ఆయన అంజలికి రావాల్సిన డబ్బులన్నింటినీ ఇప్పించి ఆమె అకౌంట్లో జమ చేయాలని సూచించారు. అదే విధంగా బాలకార్మికురాలి చేత పనిచేయించుకున్న కాటన్‌మిల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఆ మిల్లుపై జరిమానా విధించి, ఆ జరిమానా మొత్తాన్ని కూడా అంజలికి అందజేస్తామని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. కాగా, అంజలికి తౌక్లాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఎనిమిదో తరగతిలో అడ్మిషన్ ఇచ్చారు అధికారులు. ఉదారతతో ముందుకొచ్చిన విద్యావేత్తలు చదువుకోవాలన్న అంజలి తపనను చూసి చలించిన విద్యావేత్తలు కూడా ఆమెకు అండగా ఉంటామని ముందుకు వచ్చారు. ఖరగ్‌పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్, సీబీఐటీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, టీఆర్ఆర్ గ్రూపు విద్యాసంస్థల మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.రామస్వామిరెడ్డి కూడా అంజలికి బాసటగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమెతో మాట్లాడి ఆమె ఇష్టానుసారం తాను సాయం చేస్తానని చెప్పారు. అదే విధంగా యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కలిసి సామాజిక దృ క్పథంతో ఏర్పాటు చేసిన విన్ఫ్రిన్ ఫౌండేషన్ కూడా అంజలి పక్షాన ఉంటామని ప్రకటించింది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైతన్య ‘సాక్షి’తో మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే తాము విన్ఫ్రిన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసుకున్నామని, అందుకే అంజలిని ఆదుకోవాలనే నిర్ణయానికి వచ్చామని ఆయన వెల్లడించారు. కాగా, అంజలి స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పి సామాజిక బాధ్యతను నిర్వర్తించిన ‘సాక్షి’ని పలువురు ప్రశంసిస్తూ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేశారు. చదివించే బాధ్యత తీసుకుంటా డాక్టర్ కె. నారాయణ అంజలి విషయాన్ని ‘సాక్షి’ కథనం ద్వారా తెలుసుకున్న సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్. కె. నారాయణ వెంటనే స్పందిం చారు. ఆమె గురించి నల్లగొండ సాక్షి ప్రతి నిధితో మాట్లాడిన నారాయణ ఆమె అంగీ కారాన్ని బట్టి స్థానికంగా లేదంటే గుంటూరులోని ఏదైనా మంచి పాఠశాలలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నల్లగొండ జిల్లాకు చెందిన సెయింట్ మేరీస్ పాఠశాల కరస్పాండెంట్ పులిరాజు కూడా నారాయణ అభిమతం మేరకు ఆమెకు ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పిం చేందుకు ముందుకు వచ్చారు. -
పెళ్లి వద్దు.. చదువుకుంటా!
పోలీస్‌స్టేషన్‌లో తల్లిపై ఫిర్యాదు చేసిన బాలిక దేవరకొండ: ‘నాకు పెళ్లి వద్దు.. చదువుకుంటా’ అని నల్లగొండ జిల్లాలో ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. డిండి మండలం కింది శేషాయికుంటకు చెందిన వరికుప్పల సత్యనారాయణ, రామచంద్రమ్మల కుమార్తె అంజలి(14). ఐదేళ్ల క్రితం తండ్రి మరణించాడు. అంజలిని ఆరో తరగతి వరకు చదివించి మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్లులోని ఓ పత్తి మిల్లులో పనికి పంపుతోంది. ఇటీవల అంజలికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో జనవరి 1న మిల్లు నుంచి తప్పించుకుని వచ్చి డిండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అధికారులు, పోలీసులు సోమవారం అంజలిని నల్లగొండలోని బాలసదన్‌కు పంపించారు. ఇంటర్ వరకు అక్కడే చదువుకోవచ్చని సీడీపీవో సక్కుబాయి తెలిపారు.