
విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. తాజాగా ఒక టీజర్‌తో 'మకుటం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. విశాల్ కెరీర్‌లో 35వ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కీ రోల్‌లో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఆపై దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌కు ఇది 99వ చిత్రం కావడం విశేషం. ‘మద గద రాజా’ చిత్రంలో అంజలి, వరలక్ష్మిలతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని అని యూనిట్ తెలిపింది.