
సాయి ధన్సిక పేరు ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో బాగా వైరల్ అవుతుంది. నటుడు విశాల్‌తో ఆమె ప్రేమలో ఉండటమే ఇందుకు కారణం. తాజాగా వారిద్దరూ అధికారికంగా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించారు. అయితే, తాజాగా సాయి ధన్సిక నటించిన కొత్త సినిమా 'యోగి డా' నుంచి ట్రైలర్ విడుదలైంది. గౌతమ్ కృష్ణ దర్శకత్వం వహించిన యాక్షన్ తమిళ చిత్రంలో సాయాజీ షిండే, కబీర్ దుహాన్ సింగ్ నటించారు. శ్రీ మోనికా సినీ ఫిల్మ్స్ బ్యానర్‌పై వి సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ షేర్ చేసింది. భారీ యాక్షన్ సిన్స్‌లో పోలీస్ ఆఫీసర్‌గా సాయి ధన్సిక దుమ్మురేపింది. ఈ సినిమా కోసం డూప్ లేకుండానే రియల్‌గా ఆమె స్టంట్స్ చేశారట.
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ధన్సిక.. అందులో ఆయన కూతురు (యోగి) పాత్రలో మెప్పించింది. ఇప్పుడు 'యోగి డా' టైటిల్‌తో తనే ప్రధాన పాత్రలో నటించింది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది.