
పేపర్ బాయ్ తర్వాత దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(అక్టోబర్ 10)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
‘అరి’ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మూవీ తెరకెక్కించే సమయంలోనే నా జీవితానికి మూల స్థంబాలుగా ఉన్న మా నాన్న, బావగారిని కోల్పోయాను. అరి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి.. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను. ఇక రేపటి నుంచి ఈ చిత్రం మీ(ఆడియన్స్) సొంతం’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.
‘అరి’ కోసం జయ శంకర్ ఏడేళ్లు ప్రయాణం చేశాడు. ‘అరి’ కథని సిద్దం చేసుకునేందుకు హిమాలయాలకు కూడా వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిసి అరి షడ్వర్గాల మీద పట్టు సాధించాడు. అలా ఇంత వరకు సిల్వర్ స్క్రీన్ మీద రాని కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.