పెళ్లి వద్దు.. చదువుకుంటా! | Don't want marriage want to study | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దు.. చదువుకుంటా!

Jan 26 2016 5:03 AM | Updated on Aug 21 2018 5:52 PM

పెళ్లి వద్దు.. చదువుకుంటా! - Sakshi

పెళ్లి వద్దు.. చదువుకుంటా!

‘నాకు పెళ్లి వద్దు.. చదువుకుంటా’ అని నల్లగొండ జిల్లాలో ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది.

పోలీస్‌స్టేషన్‌లో తల్లిపై ఫిర్యాదు చేసిన బాలిక

 దేవరకొండ: ‘నాకు పెళ్లి వద్దు.. చదువుకుంటా’ అని  నల్లగొండ జిల్లాలో ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది.  డిండి మండలం  కింది శేషాయికుంటకు చెందిన వరికుప్పల సత్యనారాయణ, రామచంద్రమ్మల కుమార్తె అంజలి(14). ఐదేళ్ల క్రితం తండ్రి మరణించాడు.  అంజలిని ఆరో తరగతి వరకు చదివించి మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్లులోని ఓ పత్తి మిల్లులో పనికి పంపుతోంది. ఇటీవల అంజలికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో జనవరి 1న మిల్లు నుంచి తప్పించుకుని వచ్చి డిండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అధికారులు, పోలీసులు సోమవారం అంజలిని నల్లగొండలోని బాలసదన్‌కు పంపించారు. ఇంటర్ వరకు అక్కడే చదువుకోవచ్చని సీడీపీవో సక్కుబాయి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement