'ఎంత పని చేశావయ్యా?'.. పెద్ది డైలాగ్‌ లీక్ చేసిన మెగాస్టార్..! | Megastar Chiranjeevi Review On Ram Charan Peddi Trailer | Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'ఏంటయ్యా చిరు ఇది'.. తనయుడి మూవీ డైలాగ్ లీక్ చేస్తారా?

May 17 2026 10:08 AM | Updated on May 17 2026 10:26 AM

Megastar Chiranjeevi Review On Ram Charan Peddi Trailer

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ కోసం చరణ్ ఫ్యాన్స్‌ ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కానుంది.

అయితే ట్రైలర్ రిలీజ్‌కు ముందే మెగాస్టార్ ట్రైలర్ వీక్షించారు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఫుల్ ఫైర్‌పవర్ ప్యాక్డ్‌ ట్రైలర్ అని ప్రశంసలు కురిపించారు. చరణ్… బుచ్చి… రెహమాన్… ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్‌నెస్ అన్ని నెక్ట్స్‌ లెవెల్లో ఉన్నాయన్నారు.  అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్  ఇచ్చి.."మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అంటూ పెద్ది డైలాగ్ లీక్‌ చేశారు. నన్ను క్షమించు బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పాను అంటూ చిరు ట్వీట్ చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement