బ్లాక్‌మెయిల్‌ ఆరంభం | Varun Sandesh Blackmail Movie Grand Opening Ceremony | Sakshi
Sakshi News home page

బ్లాక్‌మెయిల్‌ ఆరంభం

May 18 2026 3:34 AM | Updated on May 18 2026 3:34 AM

Varun Sandesh Blackmail Movie Grand Opening Ceremony

సురేష్, వరుణ్‌ సందేశ్, కోన వెంకట్‌

వరుణ్‌ సందేశ్, సురేష్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్న సినిమా ‘బ్లాక్‌మెయిల్‌’. శ్రీనివాస్‌ గుండ్రెడ్డి దర్శకత్వంలో అవినాష్‌ కూనపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, రచయిత–నిర్మాత కోన వెంకట్‌ క్లాప్‌ ఇచ్చారు. సురేష్‌ తల్లి ఎం. వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు మంచి కంటెంట్‌తో సినిమా రాబోతోందని అర్థమైంది’’ అని అన్నారు.

‘‘నన్ను నమ్మి ఈ సినిమాను నా చేతిలో పెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు శ్రీనివాస్‌ గుండ్రెడ్డి. ‘‘నేను హీరోగా నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్‌గారు ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు సురేష్‌. ‘‘200 కుటుంబాలకు పని కల్పించవచ్చనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి వచ్చాను. నా సినిమాకు వచ్చే లాభాల్లో 10 శాతం మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్‌కు ఇస్తాను’’ అని తెలి΄ారు అవినాష్‌. ఈ చిత్రానికి సంగీతం: మల్లిక్‌ తేజ.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement