మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే | Actor Rahul Dev Reacts Why Mahesh Babu Didn't Act In Bollywood | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్ గురించి టాలీవుడ్ విలన్ షాకింగ్ కామెంట్స్

May 15 2026 1:04 PM | Updated on May 15 2026 1:09 PM

Actor Rahul Dev Reacts Why Mahesh Babu Didn't Act In Bollywood

మహేశ్ బాబు ఇప్పటివరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేశాడు. హిందీలో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆసక్తి చూపించలేదు. ఈ విషయం గురించి గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడా టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఒకప్పుడు టాలీవుడ్ విలన్ రోల్స్ చేసిన రాహుల్ దేవ్. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ గురించి ఇతడు చేసిన కామెంట్స్ షాకింగ్‌గా అనిపించాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)

మహేశ్ బాబు గతంలో ఓసారి మాట్లాడుతూ.. 'బాలీవుడ్ వాళ్లు నన్ను భరించలేరు' అన్నారు కదా దానిపై మీ స్పందన ఏంటి? అని యాంకర్ అడగ్గా.. రాహుల్ దేవ్ నవ్వుతూనే ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో కమర్షియల్ హంగులతో పాటు ఓ అర్థం ఉంటుంది. త్రివిక్రమ్‌తో మహేశ్ చేశారు. ఇలాంటి మూవీస్ హిందీలో ఉండవు. అక్కడంతా రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు తీసే టైపు సినిమాలు లేదంటే హాలీవుడ్ రీమేక్సే ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే ఆయనకు(మహేశ్) భాష రాదు అదే అసలు కారణం' అని రాహుల్ దేవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ నటుడు ఏ ఉద్దేశంతో మహేశ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశాడనేది అర్థం కావట్లేదు.

మహేశ్ గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నకు బదులిస్తూ.. 'నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. గర్వంగా అనిపించొచ్చు కానీ వాళ్లు నన్ను భరించలేరు. నా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. తెలుగు సినిమాల్లో నాకు దొరుకుతున్న స్టార్‌డమ్, అభిమానం చూసిన తర్వాత మరో పరిశ్రమకు ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. ఇక్కడే మూవీస్ చేస్తానని, అది పెద్ద హిట్ అవుతాయని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమవుతోంది' అని అన్నారు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న 'వారణాసి' మూవీ.. హిందీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

(ఇదీ చదవండి: హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు?)

Advertisement
 
Advertisement
Advertisement