పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా 'ధురంధర్ 2' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది కానీ ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంకా ఓ విషయంలో సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. ఆడియెన్స్ ఏమో ఎదురుచూస్తున్నారు. కానీ ఓటీటీ సంస్థ మాత్రం షాక్ ఇచ్చింది. ఇంతకీ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ సంగతేంటి? తెలుగు వెర్షన్ ఎందులోకి వచ్చింది?
గతేడాది డిసెంబరులో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించిన మూవీ 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.1300 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మూడు నెలలు తిరిగేసరికల్లా అంటే ఈ ఏడాది మార్చి 19న రెండో భాగాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈసారి తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. సీక్వెల్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)
అయితే తొలి భాగాన్ని థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. సీక్వెల్ కూడా ఇదే ఓటీటీలో వస్తుందని అంతా అనుకున్నారు కానీ డిజిటల్ హక్కుల్ని మన దేశం వరకు హాట్‌స్టార్ దక్కించుకుంది. విదేశాల వరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి అమెరికా, న్యూజిలాండ్, మలేసియాతో పాటు ఇతర దేశాల్లో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కానీ మన దగ్గర మాత్రం ఎప్పుడొస్తుందనే సస్పెన్స్ ఇంకా తీరలేదు. మరి ఇప్పుడు రిలీజ్ చేస్తారా? వచ్చే వారం స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి?
'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్‌వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)


