హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు? | Ram Pothineni Turns Director For His New Movie | Sakshi
Sakshi News home page

Ram Pothineni: బరువు బాధ్యతలు.. రామ్ షాకింగ్ నిర్ణయం

May 15 2026 12:11 PM | Updated on May 15 2026 12:35 PM

Ram Pothineni Turns Director For His New Movie

తెలుగులో ప్రస్తుతమున్న స్టార్ హీరోలు నటించడం తప్పితే మిగతా విషయాలపై పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు. కానీ నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ లాంటి వాళ్లు మాత్రం నటిస్తూనే రైటింగ్‌లో ప్రతిభ చూపించారు. విశ్వక్ సేన్ లాంటి ఒకరిద్దరు డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడీ లిస్టులోకి మరో హీరో చేరాడు. అతడే రామ్ పోతినేని. ఇప్పటివరకు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తన 23వ మూవీ కోసం దర్శకుడిగా మారిపోయాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)

పుట్టినరోజు సందర్భంగా రామ్.. డైరెక్టర్‌గా మారిన విషయాన్ని బయటపెట్టాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వీర పాత్రకు సంబంధించిన బ్యాక్ సైడ్ లుక్‌ని పంచుకున్నాడు. ఈ సినిమాలో హీరో కమ్ దర్శకుడిగా రామ్ వ్యవహరిస్తుండగా.. నిర్మాతగా రామ్ సోదరుడు కృష్ణ ఉన్నారు. అంటే నిర్మాణంలోనూ రామ్ హ్యాండ్ కచ్చితంగా ఉంటుంది.

రీసెంట్ టైంలో 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే రామ్‌కి మరో హిట్ అనేది లేదు. ఇది సక్సెస్ అయిందని వరసగా మాస్ మూవీస్ చేసుకుంటూ వెళ్లాడు. వీటిలో ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో రూటు మార్చేసి 'ఆంధ్రా కింగ్ తాలుకా' అని క్లాస్ టచ్ మూవీ చేశాడు. టాక్ బాగానే వచ్చింది గానీ కలెక్షన్స్ రాక ఇది కూడా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో ఓ పాట రాసిన రామ్.. ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా మారడం ఆశ్చర్యం కలిగించింది.

హీరో-దర్శకుడిగా ఈ బరువు బాధ్యతల్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి. దానికి తోడు ఈ ఏడాది డిసెంబరులోనే థియేటర్లలో రిలీజ్ అవుతుందని కూడా ప్రకటించాడు. అంటే ఆరు నెలల్లోనే మూవీ పూర్తి చేసి రిలీజ్ చేస్తాడనమాట. ప్రయత్నం మంచిదే అయినా ఎందుకీ సాహసం చేస్తున్నాడనేది ఇక్కడ ప్రశ్న.

(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)

Advertisement
 
Advertisement
Advertisement