'అరేయ్ ఆపండ్రా' ట్రైలర్ రిలీజ్ | Arey Apandra Movie Trailer | Sakshi
Sakshi News home page

'అరేయ్ ఆపండ్రా' ట్రైలర్ రిలీజ్

May 10 2026 8:59 PM | Updated on May 10 2026 8:59 PM

Arey Apandra Movie Trailer

అశోక్ నిమ్మల నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా 'అరేయ్ ఆపండ్రా'. తల్లాడ సాయి కృష్ణ లీడ్ రోల్ చేయడంతో పాటు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్, పోస్టర్‌ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా విడుదల చేశారు.

సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ ద్వారా మే 15న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంది.

ఈ సమ్మర్‌లో అందరికీ మంచి కూల్ సినిమా ఇది అవుతుందని ఆశిస్తున్నాను. నవ్విస్తూనే భయపెట్టే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్ ఇది. సెన్సార్ సభ్యులు కూడా సినిమాని చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారని నటుడు-దర్శకుడు సాయికృష్ణ చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement