రాజ్ తరుణ్ థ్రిల్లర్ మూవీ.. బర్త్‌ డే స్పెషల్ పోస్టర్ | Tollywood Hero Raj Tarun Birthday wishes from Tortoise Team | Sakshi
Sakshi News home page

Raj Tarun: రాజ్ తరుణ్ బర్త్‌ డే.. టార్టాయిస్ స్పెషల్ పోస్టర్

May 11 2026 6:41 PM | Updated on May 11 2026 6:48 PM

Tollywood Hero Raj Tarun Birthday wishes from Tortoise Team

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టార్టాయిస్. ఈ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఇవాళ హీరో రాజ్ తరుణ్ బర్త్‌ డే కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపారు మేకర్స్. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్బంగా టార్టాయిస్ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. టార్టాయిస్ కథ చాలా కొత్తగా.. డిఫరెంట్‌గా ఉంటుందని మేకర్స్ వివరించారు. హీరోకి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది.. నిద్రలో నడుచుకుంటూ వెళ్లి మర్డర్స్ చేస్తూ ఉంటాడు..ఆ తర్వాత ఏమి జరుగుతుందనే కోణంలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ మూవీలో  శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement