గత కొంతకాలంగా హీరో జయం రవి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆయన పర్సనల్ లైఫ్‌పై పుకార్లు ఎక్కువయ్యాయి. సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయన రిలేషన్‌లో ఉండడం.. విడాకులకు ఆమెనే కారణం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోల్ చేశారు. అయితే తాజాగా సింగర్ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జయం రవి మీడియా ముందుకు వచ్చాడు. ఈ వివాదాలపై మాట్లాడుతూ ఎమోషన్ అయ్యాడు.
నరకం చూశా..
ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతుందని.. ఇన్నేళ్లు ఎలాంటి మచ్చ లేకుండా బతికిన తాను.. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. ‘పెళ్లైయిన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో కనీసం గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారు. ఎంతో ఇష్టంగా కోట్లాది రూపాయలకు కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే(ఆర్తి) స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కనీసం నా పిల్లలను కూడా చూడనివ్వడం లేదు. ఫోన్లు లాక్కున్నారు. స్కూల్‌కి బాడీగార్డ్స్‌ని పెట్టి పంపిస్తున్నారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి నన్ను నాపై ట్రోలింగ్ చేస్తున్నారు. నా బిడ్డల భవిష్యత్తు కోసమే అన్నీ భరించా.
(చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!)
చేతబడి చేశారు..
ఇంట్లో ఉన్నప్పుడు నేను వారి చెప్పుచేతుల్లో ఉండడానికి నాపై చేతబడి చేశారు. నన్ను పూర్తిగా అనచివేయడానికి ఇలా చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్ల ఇప్పుడు నాకు రక్తంతో వాంతులు అవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా హింసించి నన్ను చంపేయాలని కుట్ర చేస్తున్నారు. అయితే అందరి సంగతి తేల్చేవరకు నేను పోరాడుతూనే ఉంటా.
అప్పటి వరకు నటించను
45 ఏళ్ల వయసులో అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలలో మహిళల హక్కుల గురించి మాట్లాడే తాను, ఆడవారి గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని లక్షలు పెట్టి చదివించాను. అయినా కూడా వాళ్లపై నాకు ప్రేమ లేదని రాయించారు. అవి ఎంత భాదిస్తాయో తెలుసా? ఇన్నాళ్లు నన్ను అర్ధం చేసుకుని తోడుగా నిలిచిన కేనీషాను కూడా టార్గెట్ చేసి వేధింపులు చేసి ఆమెను పంపించేశారు. మూడక్షరాల ఇడ్లీ నటి నా జీవితాన్ని నాశనం చేసింది.. నాతో పాటు ఎన్నో కుటుంబాలను ఆమె కూల్చింది. నా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకుని .. నా భార్యతో విడాకులు తీసుకున్నాకే తిరిగి సినిమాలలో నటిస్తా, అప్పటి వరకు నటించనని జయం రవి వెల్లడించారు.


