పవర్‌ఫుల్‌ సావిత్రి | First Look Of Veteran Actress Raasi As Savitri From The Red Bag | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ సావిత్రి

May 19 2026 12:25 AM | Updated on May 19 2026 12:25 AM

First Look Of Veteran Actress Raasi As Savitri From The Red Bag

కబీర్‌సింగ్, ప్రసాద్‌ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్‌ ప్రధాన తారాగణంగా నటించిన సినిమా ‘ది రెడ్‌ బ్యాగ్‌’. రవికుమార్‌ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్‌ కానుంది.

కాగా ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ సావిత్రి పాత్రలో రాశి నటించినట్లు వెల్లడించి, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా    ‘ది రెడ్‌ బ్యాగ్‌’. ఓ బ్యాగ్‌ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. కథను మలుపు తిప్పే సావిత్రి పాత్రలో రాశి నటించారు’’ అని యూనిట్‌ పేర్కొంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement