త్రిషకు నేనంటే ప్రాణం.. నా వల్ల కాదు అని ఏడ్చేసింది | Ms Raju Reveals Bonding With Trisha Latest | Sakshi
Sakshi News home page

Trisha: త్రిష మా ఫ్యామిలీ మెంబర్.. చిన్నపిల్లలా ట్రీట్ చేసేవాడిని

May 16 2026 4:56 PM | Updated on May 16 2026 5:06 PM

Ms Raju Reveals Bonding With Trisha Latest

అప్పడెప్పుడో 1999లో సినిమాల్లోకి వచ్చిన త్రిష.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. ‍స్టార్ హీరోయిన్‪గా తెలుగు, తమిళ భాషల్ని కవర్ చేస్తోంది. అయితే తమిళనాడు సీఎంగా విజయ్ గెలవడం మాటేమో గానీ సోషల్ మీడియాలో ఈమెనే ట్రెండ్ అయిపోతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

'మహేశ్ బాబు 'అర్జున్' కోసం త్రిషని ఆడిషన్ చేశారు కానీ ఎందుకో ఈ అమ్మాయి సెట్ అవ్వదని దర్శకుడికి అనిపించింది. మహేశ్ దగ్గర ఆ ఫొటోలని చూసి ఆమెని కలవాలనుకున్నాను. ఆ టైంకి ఛాన్సులు రాకపోవడంతో కొంచెం నిరాశలో ఉంది. నా నుంచి ఫోన్ రాగానే తెగ ఆనందపడింది. తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్లి చూసి ఓకే అనుకున్నాక 'వర్షం'లో హీరోయిన్‌గా సెలెక్ట్ చేశా. షూటింగ్‌లో 75 రోజుల పాటు వర్షంలో తడుస్తూనే షూటింగ్ చేసింది. ట్రైన్ నుంచి దూకే సీన్స్ చేయలేక నా వల్ల కాదు అని ఏడ్చేసింది. నేను ధైర్యం చెప్పి ప్రోత్సాహించడంతో నేను కచ్చితంగా చేస్తానని అంది. ఈ మూవీ రిలీజైన తర్వాత త్రిష మా ఇంటిలో మనిషి అయిపోయింది. అందుకే ఆమెని చిన్నపిల్లలా ట్రీట్ చేసేవాడిని'

'త్రిషకు నేనంటే ప్రాణం. ఎంతలా అంటే ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వాళ్లు..'రాత్రి 3 గంటలకు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు' అని ఆమెని అడిగితే మరో ఆలోచన లేకుండా నా పేరు చెప్పింది. నాపై ఆమెకు అంత నమ్మకం ఉండేది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాకు హీరోయిన్‌ని ఇంకా ఎవరిని అనుకోలేదు. కానీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేసింది. భోజనం చేసి తన డేట్స్ బుక్ ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తానని చెప్పింది. ఇక 'ఆట'లో ఇలియానాని హీరోయిన్‌గా పెట్టినందుకు నాపై అలిగింది. నేను షూటింగ్‌కి వచ్చేస్తానని వరసపెట్టి ఫోన్లు చేస్తూనే ఉంది. షూటింగ్ మొదలైపోయింది. ఆపడం కుదరదు అనే చెప్పడంతో శాంతించింది' అని ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు.

వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి సినిమాలు వచ్చాయి. వీటిలో తొలి రెండు సూపర్ హిట్ కాగా మూడోది మాత్రం బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. అప్పట్లో స్టోరీ అందించి నిర్మాతగా వ్యవహరించిన ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు దర్శకుడిగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన 'అగధ' విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లలోనే త్రిషతో తన బంధం గురించి చెప్పారు.

(ఇదీ చదవండి: శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్‌లో 'ధురంధర్ 2')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement