ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా | Cmantham Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్‌లోకి తెలుగు మూవీ

May 16 2026 2:40 PM | Updated on May 16 2026 2:47 PM

Cmantham Movie OTT Streaming Now

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప, బ్యాడ్ బాయ్ కార్తీక్, మిస్టర్ ఎక్స్, కాళిదాస్ 2, కర్తవ్య లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్‌తో పాటు ఎగ్జామ్ లాంటి డబ్బింగ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. 'ధురంధర్ 2' అయితే విదేశాల్లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు చిత్రం కూడా వచ్చేసింది.

(ఇదీ చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల)

వజ్రయోగి, శ్రేయ భర్తీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'Cమంతం'. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సుధాకర్ పాణి దర్శకత్వం వహించాడు. గతేడాది నవంబరు 14న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం స్టోరీ అంతంత మాత్రంగా ఉండేసరికి ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం తాజాగా రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

'Cమంతం' విషయానికొస్తే.. నగరంలో గర్భిణులని వరుసగా హత్య చేస్తుంటారు. ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు పోలీసులకు కూడా అంతుచిక్కవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ డిటెక్టివ్‌గా ఉన్న హీరో (వజ్రయోగి) ఈ కేసును ఎలా టేకప్ చేశాడు? అసలు హంతకుడు ఎవరు? వారి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్‌ తట్టుకోలేక హీరోతో సింగర్‌ బ్రేకప్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement