విజయ్‌- త్రిషలపై చీప్‌ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్‌ బ్యూటీ | Malavika Mohanan slams Unnecessary questions about Vijay directed at her | Sakshi
Sakshi News home page

విజయ్‌తో రిలేషన్‌పై అభ్యంతరకర ప్రశ్న.. ఆగ్రహించిన హీరోయిన్‌

May 17 2026 9:33 AM | Updated on May 17 2026 9:41 AM

Malavika Mohanan slams Unnecessary questions about Vijay directed at her

నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్‌ మాత్రమే కాదు, విజయ్‌ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 

అనుచిత ప్రశ్న
ఇదే సమయంలో సీఎం విజయ్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్‌ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్‌ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. 

సంచలనం కోసం..
ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్‌కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్‌ నాకు ఏడేళ్లుగా పరిచయం. 

అద్భుతం
ఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్‌ చేసింది.

సినిమా
మాళవిక మోహనన్‌ 2013లో తన సినీకెరీర్‌ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్‌తో కలిసి మాస్టర్‌ సినిమాలో నటించింది. ది రాజాసాబ్‌ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్‌ 2, పాకెట్‌ నోవెల్‌ అని రెండు సినిమాలు చేస్తోంది.

 

 

 చదవండి: టాలీవుడ్‌లో స్పెషల్‌ ఎంట్రీ

Advertisement
 
Advertisement
Advertisement