స్పెషల్‌ ఎంట్రీ | Bollywood actress Nargis Fakhri is entering Telugu cinema with a special song | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఎంట్రీ

May 17 2026 12:08 AM | Updated on May 17 2026 12:08 AM

Bollywood actress Nargis Fakhri is entering Telugu cinema with a special song

టాలీవుడ్‌కి స్పెషల్‌ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్‌ నటి నర్గీస్‌ ఫక్రీ. హవీష్‌ హీరోగా నటించిన ‘నేను రెడీ’ సినిమాలో నర్గీస్‌ ఫక్రీ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ఇదే. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించారు. ‘‘నేను రెడీ’ సినిమా రీ–రికార్డింగ్‌ పనులతో సహా ఇటీవలే షూటింగ్‌ పూర్తయింది. జూన్‌ రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం. హవీష్‌కు క్లీన్‌ కమర్షియల్‌ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement