ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న మనోజ్‌ | Actor Manchu Manoj Adopt 5 Children | Sakshi
Sakshi News home page

Manchu Manoj: కొత్త ట్రస్ట్‌ ప్రారంభించిన మంచు మనోజ్‌

May 17 2026 4:01 PM | Updated on May 17 2026 4:06 PM

Actor Manchu Manoj Adopt 5 Children

హీరో మంచు మనోజ్‌ "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించాడు. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. మార్చి 20న మనోజ్‌ పుట్టినరోజు.. ఈ క్రమంలోనే శనివారం (మార్చి 17) నాడు కొత్త ట్రస్ట్‌ను ప్రారంభిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. 'ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎవరు మన పక్కనున్నారు? ఎవరు మానవత్వంతో వ్యవహరించారనేది జీవితం గుర్తు చేస్తుంది.

అలాంటి వారికోసం..
ఈ మానవత్వం, సేవా స్ఫూర్తి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. అది ఎల్లప్పుడూ మాలో అంతర్భాగంగా ఉంది. అవసరంలో ఉన్నవారికోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈరోజు మాలో ఉన్న స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానించాలనుకుంటున్నాము.

మానవత్వం కోసం..
ముఖ్యంగా మౌనిక ప్రేరేపించిన ఆలోచనతో నేడు ఐక్యధైర్యసేనా సమితిని ప్రారంభిస్తున్నాం. ఐక్య అంటే ఐకమత్యం. మానవత్వం కోసం అందరూ ఏకం కావడం. దేవుడు మాకు ప్రసాదించినదాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుకోవాలనుకుంటున్నాము. రక్తదానం, అత్యవసర సహాయం వంటివి అవసరమైనచోట ఐక్య సంస్థ నిలబడుతుంది. ఇది రాజకీయం కాదు, అలాగే ఈ సంస్థ మాది మాత్రమే కాదు, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ..

కొత్త ఆశ
ఒక గొప్ప లక్ష్యం కోసం హృదయాలు ఏకమైనప్పుడు జీవితాలు మారడమే కాదు... ఆశ మళ్లీ జీవం పోసుకుంటుంది అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్రస్ట్‌ ద్వారా మొదటగా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు మనోజ్‌ ప్రకటించాడు. ఈరోజు నుంచి వారి బాధ్యతలు తనవేనని హామీ ఇచ్చాడు.

 

 

చదవండి: పేరెంట్స్‌ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement