సీఎంగా విజయ్‌.. సందడి మొత్తం త్రిషదే | Trisha Special Attraction In Vijay Oath Ceremony | Sakshi
Sakshi News home page

సీఎంగా విజయ్‌.. ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష సందడి

May 10 2026 11:36 AM | Updated on May 10 2026 11:50 AM

Trisha Special Attraction In Vijay Oath Ceremony

ఎట్టకేలకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్‌ ప్రమాణ స్వీకారరం చేశాడు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం ఇందుకు వేడుకైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరికంటే స్పెషల్‌ అట్రాక్షన్‌గా మాత్రం త్రిష నిలిచింది.

పద్దతిగా చీరలో.. 
విజయ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లే కాస్త ముందుగానే త్రిష తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది. పద్దతిగా చీరకట్టులో త్రిష వచ్చిన త్రిష.. పార్టీ కార్యకర్తలను, అభిమానులను నవ్వుతూ పలకరించింది. అప్పటికే వేదిక దగ్గరకు వచ్చిన విజయ్‌ తల్లిదండ్రులను కలిసింది. విజయ్‌ తల్లి..త్రిషను హత్తుకొని పలకరించింది. స్టేజ్‌ ముందు ఏర్పాటు చేసిన మొదటి వరుసలోని కుర్చీల్లో విజయ్‌ తల్లిదండ్రులతో కలిసి త్రిష కూర్చుంది. ఇక విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో త్రిష ముఖం సంతోషంతో మరింత మెరిసిపోయింది.

త్వరలోనే పెళ్లి?
విజయ్‌-త్రిష రిలేషన్‌లో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటివరకు అధికారింగా ప్రకటించలేదు. కానీ విజయ్‌ సతీమణి సంగీత విడాకులు కోరుతూ.. ఓ నటితో తన భర్త రిలేషన్‌లో ఉన్నారని ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు బయటకు వచ్చింది.  సంగీత ఆరోపణలను ఇద్దరూ స్పందించకపోవడం.. పైగా ఓ ఫంక్షన్‌కి కలిసి వెళ్లడంతో పరోక్షంగా రిలేషన్‌లో ఉన్నామనే విషయాన్ని చెప్పారు.  ఇప్పుడు విజయ్‌ సీఎం అయ్యాడు. ఇక త్వరలోనే త్రిషను పెళ్లి చేసుకొని తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించాలని విజయ్‌ భావిస్తున్నాడట.  కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టి పెట్టి.. అంతా సెట్‌ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి వీరిద్దరు వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement