విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ | Vijay rashmika Creates Crazy Record In Social Media Goes Viral | Sakshi
Sakshi News home page

Vijay- Rashmika: విరోష్ జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్

May 14 2026 3:13 PM | Updated on May 14 2026 3:47 PM

Vijay rashmika Creates Crazy Record In Social Media Goes Viral

ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్‌ ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో టాలీవుడ్‌ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.

అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్‌ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్‌లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్‌స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్‌కు వరల్డ్ వైడ్‌గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. 

మొదటి ప్లేస్ కూడా వీరిదే..

ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్‌కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement