Avika Gor: ఇండియా వదిలి వెళ్లిపోతున్న మరో హీరోయిన్ | Avika Ghor: Another heroine leaving the country | Sakshi
Sakshi News home page

Avika Gor: ఇండియా వదిలి వెళ్లిపోతున్న మరో హీరోయిన్

May 9 2026 11:20 PM | Updated on May 10 2026 10:06 AM

Avika Ghor: Another heroine leaving the country

తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గోర్. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భర్త మిలింద్ చంద్వానీ వృత్తిపరమైన అవకాశాల కారణంగా ఈ జంట భారతదేశాన్ని విడిచి బ్యాంకాక్‌లో శాశ్వతంగా స్థిరపడనుంది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత 2025 సెప్టెంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని మరింత ప్రశాంతంగా, కొత్త వాతావరణంలో గడపాలని నిర్ణయించుకున్నారు.  

తాజాగా అవికా గోర్ ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి బ్యాంకాక్‌కు శాశ్వతంగా మారిన విషయాన్ని వెల్లడించింది. మేము బ్యాంకాక్‌కు మారిపోయాం. అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాం. దాన్ని నా అభిరుచులకు అనుగుణంగా సెట్ చేసుకుంటున్నానను. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం మిలింద్‌కు అక్కడ లభిస్తున్న మెరుగైన వృత్తి అవకాశాలే. ఇద్దరం పరస్పరం చర్చించి, ఒకరి కెరీర్‌ను మరొకరు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించింది. మేము చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఎప్పుడూ ఒకరి కెరీర్ ఎంపికలకు మరొకరు అండగా నిలుస్తామని అవికా స్పష్టం చేసింది.

అయితే దేశం విడిచి వెళ్లినంత మాత్రాన అవికా తన సినీ కెరీర్‌ను వదులుకోవడం లేదు. షూటింగ్స్ ఉన్నప్పుడు బ్యాంకాక్ నుండి ముంబై లేదా హైదరాబాద్‌కు రావడం పెద్ద సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. గతంలోనూ తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మార్పు తన కెరీర్‌పై కూడా ప్రభావం చూపదని అవికా నమ్మకం. హీరోయిన్లు ఇండియా వదిలి వెళ్లిపోవడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల కిందట ఇలియానా కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిలైపోయింది. ఇప్పుడు అవికా గోర్ వంతు.

Advertisement
 
Advertisement
Advertisement