'ఆయన చేతిని ముద్దాడా.. నా జన్మ ధన్యం..' తనికెళ్ల భరణి ఎమోషనల్ | Actor Tanikella Bharani Emotional Post After Meet With PM Modi, Tweet Viral On Social Media | Sakshi
Sakshi News home page

Tanikella Bharani: 'ఇంతటితో నా జన్మ ధన్యం..' తనికెళ్ల భరణి ఎమోషనల్

May 11 2026 3:18 PM | Updated on May 11 2026 3:52 PM

Tanikella Bharani Emotional post After Meet with PM MOdi

టాలీవుడ్ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను రామున్ని చూడలేదు.. కృష్ణుడిని చూడలేదు.. ఆదిశంకరుల్ని చూడలేదు.. వివేకానందుడిని చూడలేదు.. అంటే చూడలేము కూడా అంటూ ట్వీట్ చేశారు. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న నరేంద్ర మోడీని చూశాను.. ముట్టుకున్నాను.. ఆయన చేతిని ముద్దెట్టుకున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతటితో నా జన్మ ధన్యమైందని ప్రధాని నరేంద్ర మోడీ చేతులను పట్టుకున్న ఫోటోలను షేర్ చేశారు. కాగా.. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా.. తనికెళ్ల భరణి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఫేమస్‌ అయిన తనికెళ్ల భరణి తెలుగులో కొన్ని వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. తన నటన, హవాభావాలతో తెలుగులో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement