తల్లిగా ఇంతకంటే గొప్ప కానుక మరొకటి లేదు | RK Roja Emotional After Daughter Graduated Mothers Day 2026 | Sakshi
Sakshi News home page

RK Roja Anshu: ఈ మదర్స్ డే ఎప్పటికీ మర్చిపోను.. రోజా ఎమోషనల్

May 11 2026 11:27 AM | Updated on May 11 2026 12:19 PM

RK Roja Emotional After Daughter Graduated Mothers Day 2026

ప్రముఖ నటి, మాజీ మంత్రి రోజా భావోద్వేగానికి గురయ్యారు. కుమార్తె అన్షు.. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి గ్రాడ్యుయేట్ కావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలానే పలు ఫొటోలని కూడా పంచుకున్నారు. ఈ మదర్స్ డేని ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మార్చావు అని కూతురుని తెగ పొగిడేశారు.

'నా కూతురు ‍అన్షు.. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి కంప్యూటర్ సైన్స్ హనర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని హయస్ట్ డిస్టింక్షన్‌తో పూర్తి చేసింది. ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్ఠాత్మమైన హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్ సీనియర్ అవార్డ్‌ని అందుకుని ఈ గౌరవం సాధించిన తొలి భారతీయ విద్యార్థిగా అన్షు నిలిచింది'

'గ్రాడ్యుయేషన్ కాలంలోనే అన్షు.. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, అవుట్‌స్టాండింగ్ స్టూడెంట్ లీడర్ సీఈడబ్ల్యూ & టీ 2026, లడ్డి అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, పలు డీన్స్ లిస్ట్ గౌరవాలు, అలానే ఫౌండర్స్ స్కాలర్ గుర్తింపు లాంటి పురస్కారాలను అందుకుంది. కుమార్తె కష్టపడి నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించడం కంటే తల్లికి గొప్ప కానుక మరొకటి లేదు. నా చిన్నారి అన్షు.. ఈ మదర్స్ డేని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేకమైన రోజుగా మార్చావు. గర్వంగా ఉంది' అని చెబుతూ రోజా భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement