అదితి అదరహో... | Aditi Rao Hydari looked stunning at the 79th Cannes Film Festival | Sakshi
Sakshi News home page

అదితి అదరహో...

May 18 2026 3:39 AM | Updated on May 18 2026 3:39 AM

Aditi Rao Hydari looked stunning at the 79th Cannes Film Festival

ఫ్రాన్స్‌ వేదికగా 79వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో హాలీవుడ్‌ సినీ తారలతో పాటు భారతీయ సినీ తారల హంగామా జోరందుకుంది. హీరోయిన్స్‌ హ్యూమా ఖురేషీ, అదితి రావ్‌ హైదరీ, దిశా మదన్‌ రెడ్‌ కార్పెట్‌పై నడిచారు. గ్రీన్‌ కలర్‌లో అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అదితీ రావ్‌ హైదరీ కనిపించారు. బ్లాక్‌ డ్రెస్‌లో మెరిశారు హ్యూమా ఖురేషి. హాలీవుడ్‌ స్టార్, ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలు డెమి మూర్‌ బార్బీ లుక్‌తో సందడి చేశారు.

జేమ్స్‌ గ్రే డైరెక్షన్‌లోని ‘పేపర్‌ టైగర్‌’ సినిమా ప్రీమియర్‌ సందర్భంగా డెమి మూర్‌ రెడ్‌ కార్పెట్‌ పై వాక్‌ చేశారు. స్పానిష్‌ దర్శకుడు రోడ్రిగ్‌ తెరకెక్కించిన ‘ది బిలవ్డ్‌’ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించగా, ఈ యూనిట్‌ హంగామా ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే క్రిస్టెన్‌ స్టీవర్ట్‌ ఓ లీడ్‌ రోల్‌ చేసిన ‘ఫుల్‌ ఫిల్‌’ సినిమా ప్రీమియర్‌ ప్రదర్శితమైంది. ఈ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఈ నెల 23 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement