జాతరలో డిష్యుం... డిష్యుం | Raviteja Irumudi Movie updates | Sakshi
Sakshi News home page

జాతరలో డిష్యుం... డిష్యుం

May 13 2026 1:06 AM | Updated on May 13 2026 1:06 AM

Raviteja Irumudi Movie updates

జాతరలో రెచ్చిపోయి ఫైట్‌ చేస్తున్నారట రవితేజ. ఎందుకంటే ‘ఇరుముడి’ సినిమా కోసం అన్నమాట. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర, భార్య పాత్రలో ప్రియా భవానీశంకర్‌ నటిస్తున్నారు.

నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ పాల్గొనగా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్‌ జాతర బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement