ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..! | This Week OTT Release Movies From May 18 to May 24 | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్!

May 18 2026 10:12 AM | Updated on May 18 2026 10:27 AM

This Week OTT Release Movies From May 18 to May 24

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోతారు.  ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్‌లో పెద్దగా బజ్ లేదు.

ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్‌ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్‌, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. 
 

నెట్‌ఫ్లిక్స్..

  • డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20

  • కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20

  • వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21

  • జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21

  • ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21

  • లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22

  • దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22

  • మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22

అమెజాన్ ప్రైమ్-

  • ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)-  మే 19

  • సతన్‌ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20

  • జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20

  • సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22

 

సన్ నెక్ట్స్..

  • సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20

  • బీష్మార్(మలయాళం సినిమా)- మే 22

  • శేష 2016(కన్నడ సినిమా)- మే 22


జియో హాట్‌స్టార్..

  • స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22

జీ5

  • వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22

  • మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22

సోనీలివ్..

  • మధువిదు(మలయాళ సినిమా)- మే 22

లయన్స్ గేట్ ప్లే..

  • పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement