బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయిన టాలీవుడ్ బ్యూటీ కిర్రాక్ సీత. బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్‌గా అభిమానులను మెప్పించింది. మొదట యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన సీత 7 ఆర్ట్స్ సరయుతో కలిసి చాలా వీడియోలు చేసింది. అంతే కాకుండా బేబీ మూవీలో హీరోయిన్ పక్కన ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ రోల్‌లో అద్భుతంగా నటించింది. బిగ్‌బాస్ షో మరింత ఫేమ్ తెచ్చుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తనకెదురైన అనుభవాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయట పెట్టింది. ఓ సారి సినిమా ఛాన్స్ అని కాల్ చేసి అడిగారని తెలిపింది. 7 ఆర్ట్స్‌లో చేసే సమయంలోనే సినిమా ఛాన్స్ ఉందని ఫోన్ చేసి చెప్పారని గుర్తు చేసుకుంది. అయితే ఫామ్ హౌస్‌కి రావాలిని పిలిచారని తెలిపింది. మొదట సరే అన్నా.. కానీ నేను వెళ్లలేదు.. మళ్లీ రెండు రోజుల తర్వాత కాల్ చేసి అడిగారని పేర్కొంది. ఇక్కడికి వస్తే మీకు రూ.25 లక్షలు ఇస్తారని చెబితే నేను సున్నితంగా తిరస్కరించానని సీత వెల్లడించింది.
కొంతమంది ఇలా నంబర్ దొరికితే చాలు కాల్ చేస్తుంటారని కిర్రాక్ సీత తెలిపింది. కేవలం టైమ్‌పాస్‌కు కూడా ఇలా కాల్స్ చేస్తారని వివరించింది. ఎలా ఉంటది అని నేను అడుగుతా.. ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు కదా?? అని అంటారని పేర్కొంది. అప్పుడు నేను వెంటనే ఇలా అడగడానికి మీకు సిగ్గుందా? అని వెంటనే ఇచ్చిపడేస్తానని సీత వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


