'భోగి' కోసం ఎర్రచీరలో 'మందారం' | Bhogi Movie Dimple Hayathi First Look | Sakshi
Sakshi News home page

Bhogi Movie: ఎర్ర'మందారం'గా డస్కీ బ్యూటీ డింపుల్

May 11 2026 1:27 PM | Updated on May 11 2026 1:30 PM

Bhogi Movie Dimple Hayathi First Look

ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్.. త్వరలో 'భోగి'తో రాబోతున్నాడు. విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సంపత్ నంది దర్శకుడు. ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు డింపుల్ హయాతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు)

ఇప్పటికే హీరోహీరోయిన్లు అయిన శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లుక్స్ రిలీజ్ చేశారు. తాజాగా మందారం అనే పాత్రలో డింపుల్ హయాతి లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఎర్రచీరలో డిఫరెంట్‌గా కనిపించింది. ఈ ఏడాది సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఓ హీరోయిన్‌గా చేసినప్పటికీ హిట్ అయితే దక్కలేదు.

కెరీర్ ప్రారంభం నుంచి హీరోయిన్‌గా పలు సినిమాలు చేస్తున్న డింపుల్ హయాతికి సరైన సక్సెస్ రావట్లేదు. మరి 'భోగి'లో మందారం పాత్ర అయినా దాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్)

Advertisement
 
Advertisement
Advertisement