ధనుష్‌ కొత్త సినిమా.. భారీ ఆలయ సెట్‌! | D55: A Massive Temple Set Ready For Dhansuh New Film | Sakshi
Sakshi News home page

ధనుష్‌ కొత్త సినిమా.. భారీ ఆలయ సెట్‌!

May 9 2026 12:01 PM | Updated on May 9 2026 12:19 PM

D55: A Massive Temple Set Ready For Dhansuh New Film

ధనుష్‌ హీరోగా నటించిన కర చిత్రం ఇటీవలే విడుదలై ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం ఆయన తన 55వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కీలకపాత్రను పోషిస్తున్నారు. అమరన్‌ చిత్రం ఫేమ్‌ రాజ్‌కుమార్‌ పెరియస్వామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సాయి అభయంకర్‌ సంగీతాన్ని, ఎళిల్‌ అరసు చాయాగ్రహణం అందిస్తున్నారు. 

ఈ భారీ బడ్జెట్‌ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇందులో ధనుష్‌పై ఓపెనింగ్‌ సాంగ్‌ ఉంటుందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన యూనిట్‌ సభ్యులు తాజాగా షూటింగ్‌ వేగాన్ని పెంచినట్లు సమాచారం.

చిత్త షూటింగ్‌ను చైన్నె చెంగల్పట్టు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకంగా నిలిచే ఒక ఆలయాన్ని చైన్నె సమీపంలోని గ్రామంలో బ్రహ్మాండంగా సెట్‌ వేసి షూటింగులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఈ సెట్‌లో జరగనున్న షూటింగ్‌లో ధనుష్‌ పాల్గొంటారని సమాచారం. 

ఈ షెడ్యూల్లో ధనుష్‌, శ్రీలీలపై ఒక పాటను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ధనుష్‌ ఈ చిత్రాన్ని జూలై రెండవ వారానికంతా పూర్తిచేసి తను తన తర్వాత తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వంలో నటించనున్న షూటింగ్‌కు సిద్ధమవుతారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement