కొత్త ప్రయాణం | Ram Pothineni Turns Director for His Next Film | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయాణం

May 16 2026 6:00 AM | Updated on May 16 2026 6:00 AM

Ram Pothineni Turns Director for His Next Film

బర్త్‌ డే రోజున ఫ్యాన్స్  కు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు హీరో రామ్‌ పోతినేని. దర్శకుడిగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారాయన. శుక్రవారం (మే 15) ఆయన బర్త్‌ డే. ఈ సందర్భంగా రామ్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఆయన దర్శకత్వం వహించనున్న తొలి సినిమా ఇదే. రామ్‌ కెరీర్‌లోని ఈ 23వ సినిమాను రాపో సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మించనున్నారు.

 స్టైలిష్‌ సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వీర అనే పాత్రలో నటించనున్నారు రామ్‌. ‘ది స్టోరీ ఆఫ్‌ ఎ లోన్‌ వుల్ఫ్‌’ అనేది ఈ సినిమా క్యాప్షన్ . ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను జూన్ లో ప్రారంభించి, డిసెంబరులో సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ‘‘ఈ సినిమాలో వీర పాత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని లుక్‌లో రామ్‌ కనిపిస్తారు. ఒంటరితనం, మానసిక సంఘర్షణలతో నిండిన కొత్త పాత్ర ఆయనది’’ అని యూనిట్‌ పేర్కొంది. కాగా తన గత చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ కోసం రామ్‌ రచయితగా మారి తొలి పాట రాయడంతో పాటు పాటలు పాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement