జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 20న యంగ్ టైగర్ బర్త్ డేకు ఏదైనా సర్‌ప్రైజ్ ఇస్తారా? అని వెయిటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ నెల 20న జూనియర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా కేవలం 7 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం ట్వీట్ చేసింది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
7 రోజులు మాత్రమే.
बस 7 दिन बाकी हैं.
இன்னும் 7 நாட்கள் மட்டுமே.
ಇನ್ನೂ 7 ದಿನಗಳು ಮಾತ್ರ.
ഇനി 7 ദിവസം മാത്രം.#NTRNeel First Glimpse on May 20th.— #NTRNeel (@NTRNeelFilm) May 13, 2026


