సన్నగా మారేందుకు సర్జరీ? క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్ | Keerthy Suresh Reacts Surgery Rumours Latest | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గా.. కానీ

May 16 2026 9:17 PM | Updated on May 16 2026 9:17 PM

Keerthy Suresh Reacts Surgery Rumours Latest

బొద్దుగా కనిపించే హీరోయిన్లు, హఠాత్తుగా బక్కచిక్కిపోయి కనిపిస్తే ఎవరికైనా లేనిపోని సందేహాలు వస్తాయి. హీరోయిన్ కీర్తి సురేశ్ గురించి గతంలో ఇలానే అనుకున్నారు. 2018లో 'మహానటి'లో నిండుగా బొద్దుగా కనిపించిన ఈమె.. తర్వాత కాలంలో ముఖంలో జీవకళ కోల్పోయినట్లు సన్నగా మారిపోయి షాకిచ్చింది. దీంతో అసలు ఈమెకు ఏమైందా అనుకున్నారు. కొందరైతే సర్జరీ చేసుకుందేమోనని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ సందేహాలపై స్వయంగా కీర్తినే క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్)

'2013లో నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఫిట్‌నెస్‌పై నాకేం అవగాహన లేదు. జిమ్ నా వల్ల కాదు అనుకునేదాన్ని. 2018లో 'మహానటి' చేసిన తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకున్నా. హెచ్ఐఐటీ, కార్డియో వర్కౌట్స్‌తో పాటు ఎక్కువ ప్రొటీన్, తక్కువ కార్బో డైట్ పాటించి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కానీ నేను ఇంత కష్టపడితే కొందరు మాత్రం బలహీనంగా కనిపిస్తున్నావు, సర్జరీలు చేయించుకున్నావా అని అన్నారు. అది నాకు ఆవేదన కలిగించింది'

'2020లో యోగా చేయడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శరీరంపై ప్రేమ పెరిగింది. సరైన విధంగా జిమ్ చేస్తే ఎంత ఉపయోగమో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో అర్థమైంది. ప్రస్తుతం స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తోపాటు యోగా, అనిమల్ ఫ్లో, కార్డియో, కాలిస్థెనిక్స్‌ను బ్యాలెన్స్‌గా చేస్తున్నాను. ఇప్పుడే నా జీవితంలో బెస్ట్ ఫేజ్‌లో ఉన్నా'

'అయితే నా చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నానని సన్నబడమని చెప్పినవాళ్లే.. ఇప్పుడు సన్నబడిన తర్వాత గతంలోనే బాగున్నావని అంటున్నారు. అసలు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఈ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నవడం వల్లే బయట కనిపించలేదు. జీవితంలో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాల్సి రావచ్చు. కానీ జిమ్‌ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.

కేరళకు చెందిన కీర్తి సురేశ్.. 'నేను శైలజ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'మహానటి'తో అదరగొట్టి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా దక్కించుకుంది. రీసెంట్ టైంలో టాలీవుడ్‌లో పెద్దగా నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లో చేస్తోంది.

(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement