దేవ కన్యలా ఊర్వశి.. డ్రెస్‌ ధర రూ. 1500 కోట్లా? | Urvashi Rautela Stuns At Cannes 2026 In ₹1500 Crore Glittering Silver Outfit, Fashion Accessories Viral On Social Media | Sakshi
Sakshi News home page

క్రిస్టల్‌ గౌనులో దేవ కన్యలా ఊర్వశి.. రూ. 1500 కోట్లా?

May 14 2026 9:43 AM | Updated on May 14 2026 10:20 AM

Urvashi Rautela stuns at Cannes 2026 In Glittering Silver Outfit

ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కాన్స్ చిత్రోత్సవంలో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన సీనీ తారలు పాల్గొని, తమ అందచందాలతో అదరగొడుతున్నారు. మంగళవారం ఆరంభమైన ఈ ఫెస్టివల్‌ ఈ నెల 23తో ముగుస్తుంది. ఇప్పటికే భారత్‌ నుంచి బాలీవుడ్ నటి అలియా భట్ రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది. మరో నటి ఊర్వశీ రౌతేలా కూడా క్రిస్టల్‌ గౌను ధరించి ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం ఊర్వశీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

వియత్నాంకు చెందిన ఫ్యాషల్‌ లేబుల్‌ జోలీ పొలీ కోచర్‌ ఈ గౌనుని డిజైన్‌ చేసినట్లు ఊర్వశీ రౌతేలా వెల్లడించింది. గౌనుతో పాటు ఆమె ధరించిన వెండి ఎంబ్రాయిడరీతో, క్రిస్టల్స్, పూసల వర్క్‌తో డిజైన్‌ చేసిన సిల్వర్‌ కలర్‌ ఫ్రాక్‌ అందర్నీ ఆకట్టుకుంది. అలాగే చోకర్‌ నెక్లెస్, భారీ ఇయర్‌ రింగ్స్, బ్రేస్‌లెట్, కేశాలంకరణలో పక్షి ఆకారంలో ఉన్న ఆభరణం, చేత్తో పట్టుకున్న అద్దాలు, రంగుల రాళ్లు పొదిగిన క్లచ్‌... వంటివన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయనే అభినందనలు దక్కించుకున్నాయి. 

ఊర్వశి దేవ కన్యలా ఉందని పలువురు అభినందించారు. ఊర్వశి గౌను, ఆభరణాలు, బ్యాగు విలువ ఫ్యాషన్‌ నిపుణుల అంచనా ప్రకారం దాదాపు 155.87 మిలియన్‌ డాలర్లు అట. భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1500 కోట్లు. వీటిని తయారు చేయడానికి 8 నెలలు పట్టిందట. ఇప్పటివరకూ ఊర్వశి  పాల్గొన్న కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనే అత్యంత ఖరీదైనది ఇదే అని ఫ్యాషన్‌ నిపుణులు అంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement