చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్‌కి ముందే పెంచేసిన హైప్‌ | Chiru Leaks for Ram Charan Peddi Movie hype built up before the trailer | Sakshi
Sakshi News home page

చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్‌కి ముందే పెంచేసిన హైప్‌

May 16 2026 11:28 PM | Updated on May 17 2026 5:14 AM

Chiru Leaks for Ram Charan Peddi Movie hype built up before the trailer

టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చేసే లీక్స్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్‌ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్‌ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్‌ మాత్రం ట్రయిలర్‌లోని ఓ కీలక డైలాగ్‌ను లీక్‌ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్‌ ట్రయిలర్‌లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్‌ చూశాక కంట్రోల్‌ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు.  

అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్‌ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ముగ్గురూ తమ బెస్ట్‌ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్‌ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్‌ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్‌ ట్రయిలర్‌పై ఉన్న  హైప్‌ను అమాంతం పెంచేశారు.  ఈ నెల 18న రిలీజ్‌ కానున్న పెద్ది ట్రయిలర్‌పై చిరంజీవి చేసిన ఈ లీక్స్‌ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement