సూపర్ స్టార్ మనవడి శ్రీనివాస మంగాపురం.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్ | Srinivasa Mangapuram Manga Manga Lyrical Video song Out now | Sakshi
Sakshi News home page

Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం.. హే మంగా అంటోన్న జయకృష్ణ

May 13 2026 2:55 PM | Updated on May 13 2026 2:55 PM

Srinivasa Mangapuram Manga Manga Lyrical Video song Out now

ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ రషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినీదత్‌ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. యే మంగా.. హే మంగా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్ చేశారు. ఈ పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ఎల్‌వీ రేవంత్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్‌ కంపోజ్ చేశారు. ఈ మూవీని తిరుపతి పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు... ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణం నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement