విరాట్ కర్ణ హీరోగా నటించిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నభా నటేష్, ఐశ్వర్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో లీలావతి పాత్రలో అనసూయ నటించినట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అనసూయ పాత్ర పవర్‌ఫుల్‌గా, కీలకంగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.


