టాలీవుడ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న కాక్‌టెయిల్-2 మూవీ ప్రమోషన్స్‌లో చాలా ఇబ్బందికి గురైంది. రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక మందన్నా తీవ్ర అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం.. విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీ ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కాక్‌టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.
బాలీవుడ్ మూవీ ‘కాక్‌టెయిల్-2’ ప్రమోషన్లలో షాహిద్ కపూర్ తీరుతో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు. షాహిద్ తన భుజంపై చేయి వేయగానే అన్‌కంఫర్టబుల్‌గా ఫీలై వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ ఏదో జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి… pic.twitter.com/FGza2sYnR8
— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026


