సబ్బు యాడ్‌ వివాదం.. క్షమాపణలు చెప్పిన అలీ | Ali Respond On Soap Ad Controversy | Sakshi
Sakshi News home page

సబ్బుకి లక్ష్మీ పూజ.. క్షమాపణలు చెప్పిన అలీ

May 13 2026 12:10 PM | Updated on May 13 2026 1:28 PM

Ali Respond On Soap Ad Controversy

టాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన నటించిన ఓ యాడ్‌పై ఓ వర్గం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన విమర్శిస్తూ పోస్టులు పెట్టడంతో చివరకు అలీ క్షమాపణలు చెబుతూ ఆ వీడియోని తొలగించేశాడు. అసలేం ఏం జరిగిందంటే..

అలీ ఇటీవల ఓ సబ్బుకి సంబంధించిన ప్రకటనలో నటించాడు. అందులో సబ్బుకి లక్ష్మీ పూజ చేస్తూ కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని మంత్రాలు కూడా వినిపించాయి. ఇదే ఇప్పడు వివాదానికి దారి తీసింది. ఈ ప్రకటనపై ఓ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసం మ‌త విశ్వాసాల్ని అపహాస్యం చేస్తారా అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలీ సినిమాలను బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. 

ఈ వివాదం ముదరడంతో అలీ వెంటనే స్పందిస్తూ ఓ వీడియోని విడుదల చేశాడు. ఎవ‌రైనా ఇబ్బంది ప‌డి ఉంటే క్ష‌మించాల‌ని కోరాడు. అంతేకాదు ఆ యాడ్‌ కూడా డిలీట్‌ చేశానని చెప్పారు. ముంబై కంపెనీ వాళ్లు యాడ్ చేయ‌మ‌న్నార‌ని, దేవుడు చేసిన మ‌నుషులు సినిమాలో తన‌పై కంపోజ్ చేసిన ఓ బిట్ ని ఈ యాడ్ కోసం వాడామ‌ని, అయితే త‌న స‌న్నిహితులంతా యాడ్ ఇబ్బందిగా ఉంద‌ని చెప్ప‌డంతో డిలీట్ చేశాన‌ని అలీ చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement