నిర్మాత జోకర్ అయిపోయాడు.. సెట్‌లో నా మీదే జోకులు | Producer Prasad V Potluri Reveals Why Left Tollywood | Sakshi
Sakshi News home page

Prasad V Potluri: మనమే డబ్బులు పెట్టి అవమానపడాలి

May 13 2026 4:33 PM | Updated on May 13 2026 4:39 PM

Producer Prasad V Potluri Reveals Why Left Tollywood

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. వేళ్లపై లెక్కపెట్టగలిగే నిర్మాతలు తప్పితే కొత్తగా ఎవరొచ్చినా ఇక్కడ నిలబడటం కష్టం. హీరోల ఆధిప‍త్యం చాలా పెరిగిపోయింది. దీంతో నిర్మాత అనేవాడు డబ్బులు ఖర్చుపెట్టే మెషీన్‌లా మారిపోయాడు. ఇలాంటి కారణాలతోనే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. అలాంటి వాళ్లలో ప్రసాద్ వి పొట్లూరి అలియాస్ పీవీపీ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. టాలీవుడ్‌ని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టారు.

(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)

'సినిమాలు నిర్మించడం కంటే దారుణమైన బిజినెస్ ప్రపంచంలో మరొకటి లేదు. మనం డబ్బులు పెట్టి అవమానాలు పడటం కంటే దారుణమైన విషయం లేదు. ఇండస్ట్రీలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ నిర్మాత ఓ జోకర్‌లా అయిపోయాడు. డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత మీదే సెట్‌లో అందరూ జోకులు వేస్తుంటారు. సినిమా పోతే రోడ్డున పడేది నిర్మాతే అని నా మీద ఎవరికీ ఏ ఆందోళన ఉండదు. నన్నో బఫూన్‌లా చూస్తారు. హాలీవుడ్‌లో ఉన్నట్లు ఇక్కడ స్టూడియో విధానం లేదు. హీరోలే ఇండస్ట్రీని నడిపిస్తున్నారు. నిర్మాతలకు విలువ లేదు. ఇలాంటి చోట ఉండటం ఎందుకని నేనే వచ్చేశాను' అని పీవీపీ ఆవేదన వ్యక్తం చేశారు.

'టెంపర్' సినిమాకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్‌తో వివాదం గురించి స్పందించిన పీవీపీ.. ఆ చిత్రానికి నేను సోలో ఫైనాన్సియర్. బ్యాంక్ తరహాలో వడ్డీకి అప్పు ఇచ్చి దాన్ని వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. మన డబ్బులు మనం తీసుకోవడానికి అవమానాలు పడాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు.

రవితేజ 'బలుపు' మూవీతో నిర్మాతగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం, మహర్షి లాంటి భారీ సినిమాలు చేశారు. కానీ ఉన్నట్లుండి సడన్‌గా నిర్మించడం మానేశారు. ఇన్నాళ్లకు అందుకు గల కారణాన్ని బయటపెట్టారు.

(ఇదీ చదవండి: విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement