విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్ | Bollywood Actress Mouni Roy Reacts To Divorce Rumours With Husband Suraj Nambiar, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Mouni Roy: భర్తతో విడిపోతున్నట్లు రూమర్స్.. నటి ఏమందంటే?

May 13 2026 3:32 PM | Updated on May 13 2026 4:10 PM

Mouni Roy Reacts Divorce Rumours

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మౌనీరాయ్ విడాకులు తీసుకోందని వార్తలు వినిపిస్తున్నాయి. భర్త సూరజ్ నంబియార్‌ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే దీనికి కారణం. ఇప్పటికీ వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకుల తతంగం కూడా పూర్తయిందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తనపై వస్తున్న పుకార్లపై మౌనీ స్పందించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)

'మీడియా వాళ్లకు విజ్ఞప్తి. అవాస్తవాలని ప్రచారం చేయొద్దు. మాకు కాస్త ప్రైవసీ ఇవ్వండి ప్లీజ్' అని మౌనీరాయ్.. తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. మరి విడాకుల వార్తల్లో నిజానిజాలేంటి అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

2018లో దుబాయిలో కలుసుకున్న సూరజ్-మౌనీరాయ్ నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి 2022లో గోవా వేదికగా పెళ్లి చేసుకున్నారు. మలయాళీ-బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో ఈ వేడుక జరిగింది. సూరజ్, దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్ కాగా మౌనీ, హిందీ-దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్, నటిగా కనిపిస్తూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. లేటెస్ట్‌గా అయితే చిరు 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది.

(ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ)

Advertisement
 
Advertisement
Advertisement